Home » Samantha : మ‌రోసారి ఐటెం భామ‌గా మారుతున్న సమంత‌..డబ్బుల కోసమే!

Samantha : మ‌రోసారి ఐటెం భామ‌గా మారుతున్న సమంత‌..డబ్బుల కోసమే!

by Bunty
Ad

స్టార్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తన అద్భుతమైన నటన, అందంతో ఎంతోమంది ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ భామ. ఎప్పటికప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. సమంత ఎప్పటికప్పుడు వరుస ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తోంది. ఈ మధ్యకాలంలో సమంత చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో ఫుల్ హీట్ ఎక్కిస్తోంది. ఇక సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడిన సంగతి మన అందరికీ తెలిసిందే.

Samantha item song in pushpa 2

తాను అమెరికాలో చికిత్స తీసుకొని వచ్చింది. ఇక తాను సంవత్సరం పాటు సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టనుంది.  ప్రస్తుతానికి సమంత ఎప్పటిలాగే కనిపిస్తోంది. చాలా యాక్టివ్ గా మునుపటి కన్నా అందంగా కనిపిస్తోంది. ఇక సమంత బ్యాక్ టు బ్యాక్ ఫోటోషూట్లు చేస్తున్నప్పటికీ సినిమాల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం సమంత మరోసారి ఐటమ్ సాంగ్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ లో రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇక పుష్ప-2 సినిమాలో కూడా సమంత ఐటెం సాంగ్ చేయనుందట.

Advertisement

Advertisement

పుష్ప-2 సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో చర్చలు జరిపారట సుకుమార్. కానీ ఎవరు అంతగా సెట్ అవ్వకపోవడంతో మళ్లీ సమంతను రంగంలోకి దించాలని అనుకున్నారట సుకుమార్. కేవలం ఐటమ్ సాంగ్ లో మాత్రమే కాకుండా కొన్ని సీన్లలో కూడా సమంత కనిపించబోతుందట. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ పుష్ప 2 సినిమాలో మళ్లీ సమంత నటిస్తే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అలాగే సమంతకు బాగానే రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading