Telugu News » Blog » సమంత ఐటమ్ సాంగ్ మామూలుగా ఉండదు…కొరియో గ్రాఫర్ ఎవరంటే…?

సమంత ఐటమ్ సాంగ్ మామూలుగా ఉండదు…కొరియో గ్రాఫర్ ఎవరంటే…?

by AJAY
Ads

సుకుమార్ సినిమా అంటే ఓ ఐటం సాంగ్ పక్కా అని తెలిసిందే. ఇప్పటివరకు సుక్కు తీసిన అన్ని సినిమాల్లోనూ ఐటమ్ సాంగ్ లు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఆర్య, ఆర్య -2, 100% లవ్, రంగస్థలం ఇలా ప్రతి సినిమాలోనూ ఓ ఐటమ్ సాంగ్ లతో సుక్కు తన మార్క్ ను చూపిస్తారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో కూడా సుకుమార్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు. అయితే ఈ సాంగ్ ను టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న సమంత చేయడం చెప్పుకోదగ్గ విషయం. చైతూ తో విడాకుల అనంతరం సమంత వరుస సినిమాలు ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే.

Advertisement

Samantha item song for pushpa

Samantha item song for pushpa

అయతే ఇప్పటి వరకు తాను చేయని ఐటమ్ సాంగ్ సైతం చేసేందుకు సమంత ఒప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దాంతో తలకు ఇక హద్దులు లేవని సమంత చెప్పకనే చెబుతోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 లో బోల్డ్ పాత్రలో నటించి మతిపోగొట్టిన సమంత రీసెంట్ గా హాలీవుడ్ సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇప్పుడు పుష్పలో ఐటమ్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరూ అవాక్కయ్యేలా చేసింది. ఇక సమంత ఐటమ్ పాట పుష్ప సినిమాకే హైలెట్ గా నిలవనుంది అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

Advertisement

ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన లుక్ చూస్తుంటే సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాటను హైదరాబాదులో చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పాట షూటింగ్ కు వారం రోజుల ముందు నుండే అల్లు అర్జున్ సమంత రిహాల్సల్స్ చేస్తారని సమాచారం. అదే విధంగా ఈ పాటను బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కంపోజ్ చేయనున్నారు. దీనికోసం ప్రత్యేక సెట్ ను సైతం నిర్మించారు. ఈ పాట మాస్ ఆడియన్స్ కు పక్కా ట్రీట్ గా నిలవనుంది. మరి సమంత ఐటమ్ సాంగ్ తో ఏమేరకు అదరగొడుతుందో చూడాలి.