Telugu News » Blog » “గ్రేట్ లెసన్”… సమంత పోస్ట్ ఎవరిని ఉద్దేశించి ?

“గ్రేట్ లెసన్”… సమంత పోస్ట్ ఎవరిని ఉద్దేశించి ?

by Bunty
Ads

సమంత రూత్ ప్రభు తన తాజా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేస్తున్న వరుస పోస్టులు మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ప్రతిసారీ తన ఆలోచనలు, ప్రేరణ, ఆలోచనాత్మక కోట్‌లను పంచుకుంటుంది. ఆమె తన గ్రామ్‌లో తాజాగా మళ్లీ ఒక జంట పోస్టును పంచుకుంది. మొదటి సోషల్ మీడియా పోస్ట్‌లో సమంత “గ్రేట్ లెసన్” గురించి మాట్లాడింది. “జీవితంలో నేను నేర్చుకున్న గొప్ప పాఠం ఏమిటంటే నేను ఇంకా చాలా నేర్చుకోవలసి ఉంది” అని అందులో ఉంది. సమంతా రూత్ ప్రభు తన గ్రామ్‌లో పంచుకున్న మరో పోస్ట్‌లో ‘అంగీకారం’ గురించి షేర్ చేసింది.

Advertisement

sam

Advertisement

Advertisement

ఈ చెరిల్ స్ట్రేడ్ కోట్ “చాలా విషయాలు బాగానే ఉంటాయి. కానీ అనుకున్నవి అన్నీ జరగవు. కొన్నిసార్లు మీరు బాగా పోరాడి ఓడిపోతారు. కొన్నిసార్లు మీరు చాలా గట్టిగా ప్రయత్నించినా ఫలితం లేదని తెలుసుకుంటారు. కానీ వదలడానికి మనసొప్పదు. కానీ వేరే అవకాశం ఉండదు వదిలేయాల్సిందే. చిన్న అంగీకారం, మౌనం” అంటూ సామ్ పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. తనలో తాను స్ఫూర్తి నింపుకోవడానికి ఇలాంటి పోస్టులను సామ్ షేర్ చేస్తోందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాగ చైతన్య నుండి సమంత విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుండి ఆమె స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌లు చాలా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం సామ్ తన వృత్తిపరమైన కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉంది. ఆమె ఇటీవలే అల్లు అర్జున్, రష్మిక మందన్నల “పుష్ప: ది రైజ్” చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ ను పూర్తి చేసింది. మరోవైపు గుణశేఖర్ ఎపిక్ లవ్ స్టోరీ “శాకుంతలం”లో నటిస్తోంది. అంతేకాదు తమిళంలో విఘ్నేష్ శివన్ “కాతు వాకులా రెండు కాదల్” సినిమాలో కూడా కబ్పించనుంది.