Home » పుష్ప ఐటెం సాంగ్ పై ట్రోలింగ్.. స‌మంత సంచ‌ల‌న ట్వీట్

పుష్ప ఐటెం సాంగ్ పై ట్రోలింగ్.. స‌మంత సంచ‌ల‌న ట్వీట్

by Bunty

పుష్ప ఐటెం సాంగ్ ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రల‌ను ఊపేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఆది నుంచి ఈ సాంగ్ పై వివాదం చెల‌రేగుతూనే ఉంది. పురుషుల మ‌నో భ‌వాల‌ను దెబ్బ తీశాయ‌ని.. పురుషుల సంఘం పిటీష‌న్ వేయ‌గా.. దేవీ శ్రీ ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌ల‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంట‌ర్ ఇచ్చారు.

అయితే.. ఇంత ర‌చ్చ జ‌రుగుతున్నా హీరోయిన్ స‌మంత మాత్రం.. ఈ పాట‌ను బాగా ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఈ పాట పై షార్ట్ వీడియో పోస్ట్ చేసిన‌ కొంద‌రు నెటిజ‌న్ల వీడియోను స‌మంత షేర్ చేసింది. అంతేకాకుండా.. ఆ వీడియోను స్మైలీ ఎమోజీల‌ను కూడా పోస్ట్ చేసింది సామ్‌.

కాగా.. ఈ షార్ట్ వీడియో లో ముగ్గురు యువ‌కులు పుష్ప ఐటెం సాంగ్ ను ట్రోల్ చేశారు. ఎగ్జామ్స్ ఉన్యాయ్ క‌దరా.. అంటే ఎగ్జామ్ లో కూడా.. ఊ అంటావా మారా.. ఊ ఊ అంటావా మావా అనే పాట‌ను రాస్తాన‌నే భ‌యం ఉందిరా.. అంటూ సాంగ్ కు కౌంట‌ర్లు ఇచ్చారు. అయితే.. ఈ వీడియోను స‌మంత ట్విట్ట‌ర్ లో షేర్ చేయ‌డం అంద‌రినీ షాక్ గురి చేస్తుంది.

Visitors Are Also Reading