Telugu News » బ‌న్నీ భార్య‌పై స‌మంత హాట్ కామెంట్‌…

బ‌న్నీ భార్య‌పై స‌మంత హాట్ కామెంట్‌…

by Bunty

స‌మంత సోష‌ల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. పెళ్లికి ముందు ఎంత దూకుడుగా వ్య‌వ‌హ‌రించిందో, చైతూతో విడాకుల త‌రువాత కూడా అంతే దూకుడుగా వ్యవ‌హ‌రిస్తోంది సామ్‌. స్నేహితుల కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతూ, సినిమాల‌పైనా, ఫొటోల‌పైనా కామెంట్లు చేస్తూ బిజీగా మారిపోయింది. పెద్ద స్టార్స్ సినిమాల‌కు శుభాకాంక్ష‌లు చెప్ప‌డ‌మే కాకుండా, సినిమాపై రివ్యూలు కూడా ఇస్తోంది. విడాకుల త‌రువాత బ‌న్నీ సినిమాలో ఐటెం సాంగ్‌లో న‌టించి షాక్ ఇచ్చింది. ఈ సాంగ్‌లో మ‌రింత బోల్డ్‌గా క‌నిపించి వావ్ అనిపించింది. అదే రేంజ్‌లో వ‌స్తున్న ట్రోల్స్‌కు ధీటుగా స‌మాధానాలు ఇస్తోంది సామ్.

ఇక ఇదిలా ఉంటే, బ‌న్నీ, ఆయ‌న భార్య క‌లిసి తీసుకున్న ఓ ఫోటోను స్నేహారెడ్డి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్లాక్ క‌ల‌ర్ శారీలో దిగిన ఫొటో అది. అంద‌రూ వావ్, సూప‌ర్ అని కామెంట్స్ చేస్తుంటే, స‌మంత మ‌రో అడుగు ముందుకు వేసి హాట్ అని కామెంట్ చేసింది. దీంతో స‌మంత కామెంట్స్ ఇప్పుడు బ‌న్నీ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. నీక‌న్నా హాట్ కాదులే అంటూ కామెంట్స్ చేస్తున్నారు బన్నీ అభిమానులు. ఎవ‌రెన్ని కామెంట్స్ చేసినా స‌మంత ధీటుగా వాటికి స‌మాధానం చెబుతున్నది. హాట్ అనే ప‌దానికి అర్ధం తెలుసుకోవాల‌ని హిత‌బోధ చేస్తున్న‌ది సామ్‌.

Ads

You may also like