Ad
టాలీవుడ్ లో ఏం మాయ చేసావే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత చాలా కొన్ని సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తూ వచ్చింది. హన సినిమాలు హిట్ అయినా.. ప్లాప్ అయినా సమంతకు మాత్రం అవకాశాలు అనేవి ఆగలేదు. అయితే ఈ మధ్య కాలంలో సమంత జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత… సమంతకు అవకాశాలు తగ్గడంతో పుష్ప సినిమాలో ఐటం సాంగ్ చేసి మళ్ళీ పైకి లేచింది. అయితే తన కెరియర్ లో చేసిన ఎన్నో పాత్రలో తాను చేసిన బెస్ట్ పాత్ర గురించి తాజాగా సామ్ వివరించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన సమంత మాట్లాడుతూ…. నాకు ఒక్కే తరహా పాఠాల్లో చేయడం ఎక్కువ నచ్చదు. అందుకే ఎప్పుడు కొత్త తరహా పాత్రలు చేయాలనీ నేను అనుకుంటారు. అయితే ఆలా రొటీన్ కు భిన్నంగా మన పాత్రలు ఎంచుకున్నప్పుడు.. ఆ పాత్రకు న్యాయం చేయడం కోసం చాలా కష్టపడాలి. నేను ఈ మధ్య కాలంలో నటించిన ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ 2 లో నా పాత్ర అటువంటిందే. అందులో రాజీ అనే పాత్ర ఎన్నో కష్టాలకు.. ఒడిదుడులకు లోనవుతుంది. నేను వాటన్నింటిని కూడా నాకు అయ్యేనట్లే ఫీల్ అయ్యాను. అందుకే ఆ పాత్ర అనేది అంత బాగా వచ్చింది.
నేను కొత్త పాత్రల కోసం ఎదురు చూస్తున సమయంలోనే నాకు.. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ 2 లో అవకాశం వచ్చింది. ఇక ఆ కథ విన్న వెంటనే నేను ఒకే చెప్పను. అందులో చేశాను. ఇక నేను నా కెరియర్ లో ఇప్పటివరకు చేసిన అన్ని పాత్రల్లో కంటే ఇందులోని రాజీ పాత్రనే అన్నిటికంటే బెస్ట్ అని సమంత పేర్కొంది. ఇక సందర్భాన్ని… సమయాన్ని బట్టి పుష్పలో స్పెషల్ సాంగ్ లో కూడా నేను నటించాను. కానీ దానిని కూడా నేను ఛాలెంజింగ్ గా తీసుకున్నాను అని తెలిపింది. అయితే ప్రస్తుతం తెలుగులో శాకుంతలం అనే సినిమాతో పాటుగా.. విజయ్ దేవరకొండతో మరో సినిమాలో నటిస్తుంది సామ్.
ఇవి కూడా చదవండి :
కోహ్లీ వల్లే బెయిర్‌స్టో సెంచరీ చేశాడా…?
నా చెత్త రికార్డ్ బ్రేక్ అయ్యింది అని ఏడుస్తున్న బౌలర్..!
Advertisement