Home » ఫ్యామిలీమ్యాన్ మేక‌ర్స్ తో స‌మంత మ‌రో వెబ్ సిరీస్..బాలీవుడ్ హీరోతో రొమాన్స్..?

ఫ్యామిలీమ్యాన్ మేక‌ర్స్ తో స‌మంత మ‌రో వెబ్ సిరీస్..బాలీవుడ్ హీరోతో రొమాన్స్..?

by AJAY
Ad

అందాల తార స‌మంత చైతూతో విడాకుల అనంత‌రం త‌గ్గేదే లే అంటూ వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తోంది. ఇప్ప‌టికే స‌మంత ప‌లు చిత్రాల‌కు ఓకే చెప్పింది. అంతే కాకుండా పుష్ప సినిమాలో ఐట‌మ్ సాంగ్ చేసి ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంది. ఇక ఇప్పుడు స‌మంత మ‌రో వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే స‌మంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీల్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

Advertisement

అయితే ఈ వెబ్ సిరీసే స‌మంత కొంప ముంచింద‌ని విడాకుల‌కు స‌మంత ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా న‌టించ‌డ‌మే కార‌ణ‌మ‌ని ర‌క‌ర‌కాల వార్త‌లు పుట్టుకువ‌చ్చాయి. అయితే ఇప్పుడు మ‌రోసారి స‌మంత ఫ్యామిలీ మ్యాన్ ను తెర‌కెక్కించిన రాజ్ డీకేల ద‌ర్శ‌క‌త్వంలోనే న‌టించ‌బోతుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వెబ్ సీరీస్ ను సిటాడెల్ అనే ఇంట‌ర్ నేష‌న‌ల్ వెబ్ సిరీస్ ను మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం.

అంతే కాకుండా ఈ వెబ్ సిరీస్ లో హీరోగా బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ న‌టించ‌బోతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే వెబ్ సిరీస్ లు అంటే మినిమ‌మ్ రొమాన్స్ ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అలాంటిది బాలీవుడ్ వెబ్ సిరీస్ అంటే ఖచ్చితంగా బోల్డ్ స‌న్ని వేశాలు ఉంటాయ‌ని మూవీల‌వ‌ర్స్ అనుకుంటున్నారు. ఇక ఫ్యామిలీ మ్యాన్ తో ఆక‌ట్టుకున్న సమంత ఈ వెబ్ సిరీస్ తో ఏ మేర‌కు అల‌రిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading