Home » సామ్ కరణ్ పై కాసుల వర్షం.. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో..!

సామ్ కరణ్ పై కాసుల వర్షం.. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో..!

by Anji

సాధారణంగా ఐపీఎల్ లో ప్రతి ఏడాది వేలంలో రికార్డు క్రియేట్ చేసే విషయం అందరికీ తెలిసిందే. ఐపీఎల్ వేలంలో ఎక్కువగా ఆల్రౌండర్ అయినటువంటి ఆటగాళ్లకే ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం ఆ దిశగానే పంజాబ్ జట్టు సామ్ కరన్ ని భారీ ధరకు కొనుగోలు చేసింది. 2019 ఐపీఎల్ లో ఆల్ రౌండర్ సామ్ కరన్ నీ మొదటిసారిగా పంజాబ్ కింగ్స్ రూ. 7.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2020లో విడుదలయ్యాడు. అంతరం చెన్నై సూపర్ కింగ్స్ రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది గాయం కారణంగా మెగా వేలంలో అతను పాల్గొనలేదు. 

 

సామ్ కరన్ టీ-20 ప్రపంచ కప్ లో 6 మ్యాచుల్లో 6.52 ఎకానమీ తోనే పరుగులు ఇచ్చాడు. 13 వికెట్లు తీసిన ఇతడు ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ కూడా నిలిచాడు. ఫైనల్లో 12 పరుగులకే మూడు వికెట్లను తీశాడు. ప్రధానంగా డెత్లలో అతని బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ లెక్కల తోనే ఈ మినీ వేలంలో అందరి చూపును తన వైపునకు తిప్పుకున్నాడు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ కోసం బెంగళూరు ముంబై రాజస్థాన్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. బేస్ ప్రైజ్ రూపాయలు రెండు కోట్లతో వేలంలోకి ఎంట్రీ ఇచ్చారు సామ్ కరన్. రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. 

Also Read :   రమీజ్ రాజా ని పీసీబీ చైర్మన్ పదవీ నుంచి తొలగించడానికి కారణం ఇదేనా..?

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ కరన్ ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. బేస్ ధర కంటే దాదాపు 9 రెట్లు ఎక్కువగా దక్కించుకున్నాడు. ఐపీఎల్ లో సామ్ కరన్ ని పరిశీలించినట్లయితే.. మొత్తం 32 మ్యాచ్ లు ఆడి 337 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు, అదేవిధంగా బౌలింగ్ వేసి 32 వికెట్లను తీశాడు. సామ్ కరన్ ని రికార్డ్ స్థాయిలో పంజాబ్ కొనుగోలు చేయడంతో సోషల్ మీడియాలో అతనికి ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. 

Also Read :   2022లో అత్యంత ధనికమైన 10 మంది ఇండియన్ క్రికెటర్లు

Visitors Are Also Reading