Home » వైరల్ అవుతున్న 34 ఏళ్ల క్రితం సల్మాన్ లవ్ లెటర్..!

వైరల్ అవుతున్న 34 ఏళ్ల క్రితం సల్మాన్ లవ్ లెటర్..!

by Sravya
Ad

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఆయన అందరికీ సుపరిచితమే తెలుగు ప్రేక్షకులకి కూడా సల్మాన్ గురించి తెలుసు. సల్మాన్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటినుండి చాలామంది హీరోయిన్ల తో ప్రేమ వ్యవహారం నడిపినట్లు వార్తలు వచ్చాయి. వాళ్ళల్లో ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్ వంటి సూపర్ స్టార్స్ వున్నారు. ఎవరిని కూడా ఆయన ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు అందుకే సల్లు లవ్ లైఫ్ గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వస్తుంటుంది. ఇప్పటికీ సల్మాన్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

ఇప్పుడు సల్మాన్ రాసిన ప్రేమ లేక నెట్టింట వైరల్ అవుతోంది. ఈ లేఖను సల్మాన్ స్వయంగా రాసినట్లు తెలుస్తోంది. ఈ ప్రేమలేఖ 34 ఏళ్ల క్రితం నాటిది తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళ కోసం ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖను 1989లో రాశారు. ఈ లేఖలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తావని ఆశిస్తున్నాను అని ఉంది. తన ప్రియురాలి కోసం కాకుండా అభిమానుల కోసం ఈ లేఖ రాశాడని తెలుస్తోంది.

Advertisement

Advertisement

Also read:

సల్మాన్ ఖాన్ కల్ట్ క్లాసిక్ చిత్రం మైనే ప్యార్ కియా భారీ విజయాన్ని అందుకుంది. క్రేజ్ కూడా పెరిగింది. ఈ మేరకు సల్మాన్ తన అభిమానులకి లేఖ రాశారు. 29 డిసెంబర్ 1989 న విడుదలైంది మూవీ. సల్మాన్ నాలుగు నెలల తర్వాత ఏప్రిల్ 1990లో రాశారు ఈ లేఖలో నన్ను అంగీకరించినందుకు, నన్ను ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు ముందుగా నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నా శక్తి మేరకు మంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను ఇకనుండి ఏ సినిమా చేసిన మైనే ప్యార్ కియా తో పోలుస్తారని నాకు తెలుసు కనుక మంచి సినిమా చేయాలనే నా 100% ప్రయత్నం అని రాశారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading