Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

by Sravan Sunku
Ads

ఆంధ్రప్రదేశ్‌లోని 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.. ఎమ్మెల్యే కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాలకు, స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్‌ కూడా జారీ చేశారు.. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 16న నోటిఫికేషన్‌ జారీచేసి అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.

Advertisement

Ad

Advertisement

ఇక, ఈ ఎన్నికలకు సిద్ధమైపోతోంది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ… ఇవాళ మీడియాతో మాట్లాడిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కడప జిల్లా- గోవింద రెడ్డిని కొనసాగించనున్నారు.  శ్రీకాకుళం జిల్లా పాలవలస విక్రాంత్ (కాపు), కర్నూలు-ఇషాక్ (మైనారిటీ) నంద్యాల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ను అభ్యర్థులుగా ప్రకటించారు.. ఈ ఎన్నికలు ముందే జరగాల్సినవి. కానీ, కోవిడ్ కారణంగా ఆలస్యంగా ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ జరుగుతోందని వివ‌రించారు సజ్జల రామకృష్ణారెడ్డి.

 

 

Visitors Are Also Reading