Home » ఆ విష‌యంలో స్టార్ హీరోల‌ను హ‌ర్ట్ చేశానంటున్న సాయికుమార్..!

ఆ విష‌యంలో స్టార్ హీరోల‌ను హ‌ర్ట్ చేశానంటున్న సాయికుమార్..!

by AJAY
Ad

సీనియ‌ర్ హీరో సాయికుమార్ ప‌లువురు హీరోల‌కు డ‌బ్బింగ్ చెబుతూ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా రాజ‌శేఖ‌ర్ సినిమా అంటే సాయికుమార్ వాయిస్ ఉండాల్సిందే. రాజ‌శేఖ‌ర్ తో పాటూ సాయికుమార్ సుమ‌న్,ర‌జీనీకాంత్ లాంటి స్టార్ ల‌కు కూడా డ‌బ్బింగ్ చెప్పేవారు. అలా స్టార్ హీరోల‌కు డ‌బ్బింగ్ చెప్పిన సాయికుమార్ తాను హీరో అయిన త‌ర‌వాత ఇత‌ర హీరోల‌కు డ‌బ్బింగ్ చెప్ప‌డం మానేశారు. అలా చేసి త‌ప్పుచేశాన‌ని తాజాగా సాయి కుమార్ ఓ ఇంట‌ర్య్వూలో వెల్ల‌డించారు.

Advertisement

saikumar

saikumar

తాజాగా సాయికుమార్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ…..పోలీస్ స్టోరీ సినిమా తర‌వాత కొంత మంది పెద్ద‌వాళ్లు త‌న‌తో నీకు ఉన్న‌దే వాయిస్ నువ్వు హీరో అయిన త‌ర‌వాత ఆ వాయిస్ అంద‌రికీ ఇస్తే మొనాటినీ అయిపోతుంద‌ని అలా చేయ‌కు అని చెప్పార‌ని తెలిపాడు. వాళ్లు చెప్పింది విని రాజ‌శేఖ‌ర్ సుమ‌న్ లాంటి స్టార్ ల‌ను తాను హ‌ర్ట్ చేశాన‌ని చెప్పారు. హీరో ర‌జినీకాంత్ బాషా సినిమాతో పాటూ చాలా సినిమాల‌కు తాను డ‌బ్బింగ్ చెప్పాన‌ని అన్నారు.

Advertisement

వాళ్లు స్టార్స్ అని సాయికుమార్ డ‌బ్బింగ్ చెప్ప‌న‌ని అన్నాడు అంటే వాళ్ల‌కు ఏదోలా అనిపిస్తుంది క‌దా అంటూ సాయికుమార్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక తాను మొద‌ట‌గా డ‌బ్బింగ్ కోసం రెమ్యున‌రేష‌న్ రూ.500 తీసుకున్నాని అక్క‌డ నుండి రూ.25వేల వ‌ర‌కూ తీసుకున్నాని సాయి కుమార్ పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు డ‌బ్బింగ్ అనేది లక్ష‌ల్లోకి వెళ్లిపోయింద‌ని తెలిపాడు.

Visitors Are Also Reading