మెగామేనల్లుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో సాయిధరమ్ తేజ్. మొదటి సినిమాతోనే సాయిధరమ్ తేజ్ అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కెరీర్ పీక్స్ లోకి వెళుతున్న సమయంలో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ సినిమా విడుదలకు ముందు సాయిధరమ్ తేజ్ కు కేబుల్ బ్రిడ్జ్ పై రోడ్డు ప్రమాధానికి గురయ్యాడు.
Advertisement
ఈ రోడ్డు ప్రమాదంతో తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. బయటకు పెద్దగా గాయాలు కనిపించలేదు కానీ చెస్ట్ కింద ఓ యముక విరిగినట్టు డాక్టర్లు గుర్తించారు. దాంతో ఆస్పత్రిలో చేరిన తేజ్40 రోజుల పాటూ ఐసీయూలో చికిత్స తీసుకున్నాడు. చికిత్స అనంతరం బయటకు వచ్చిన తరవాత తేజ్ ఓ వీడియోను విడుదల చేశాడు.
Advertisement
తనకు యాక్సిడెంట్ జరిగిన సమయంలో కాపాడిన యువకుడికి మరియు తన కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు చెప్పాడు. అయితే సాయిధరమ్ తేజ్ వీడియో వదిలిన సమయంలో చూడ్డానికి బాగానే ఉన్నాడు. కానీ తాజాగా కమల్ హాసన్, చిరు లతో సాయిధరమ్ తేజ్ ఓ ఫోటో దిగాడు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగవైరల్ అవుతోంది. అయితే ఆ ఫోటోలో సాయిధరమ్ తేజ్ లుక్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. సాయిధరమ్ తేజ్ గతంలో చాలా ఫిట్ గా ఉండేవాడు. కానీ ఇప్పుడు మాత్రం సాయిధరమ్ తేజ్ బక్కచిక్కిపోయి కనిపిస్తున్నాడు.
యాక్సిడెంట్ తరవాత ట్రీట్మెంట్ అనంతరం షేర్ చేసిన వీడియోలో కూడా సాయిధరమ్ తేజ్ మామూలుగానే ఉన్నాడు. కానీ ప్రస్తుతం తేజ్ చాలా సన్నగా నీరసంగా కనిపిస్తున్నాడు. దాంతో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదేమోనని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తేజ్ మాత్రం తాను షూటింగ్స్ లో పాల్గొంటున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం తేజ్ ఓ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది.