Home » Yash: యష్ సినిమాలో సాయి పల్లవి.. డైరెక్టర్ ఎవరంటే?

Yash: యష్ సినిమాలో సాయి పల్లవి.. డైరెక్టర్ ఎవరంటే?

by Bunty
Ad

యష్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఈ సినిమా విడుదలై దాదాపు ఏడాదిన్నర గడుస్తున్న ఇప్పటివరకు మరో సినిమాని ప్రకటించలేదు యష్. దీంతో అభిమానులు ‘యష్19’ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నడ పరిశ్రమలో స్టార్ హీరో అయినటువంటి యష్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీంతో యష్ నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది.

Sai Pallavi is likely to share the screen with Yash in Yash 19

డిసెంబర్ 8వ తేదీన శుక్రవారం ఉదయం 9 గంటల 55 నిమిషాలకు ‘యష్19’ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నట్లు యష్ తెలియజేశాడు. ఈ సినిమాకు సంబంధించి ఎంతోమంది నటీనటుల పేర్లు తెరపైకి వస్తున్న క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి పేరు ముందు వరుసలో ఉంది. ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా గుర్తింపు పొందినటువంటి సాయి పల్లవికి ప్రేక్షకులను తన వైపు ఆకట్టుకునే నటన, డ్యాన్స్ తనలో ఉంది. సాయి పల్లవి తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ్ పంటి భాషా చిత్రాల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

ఇక ఈ హీరోయిన్ తాజాగా యష్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. నాగచైతన్య హీరోగా వస్తున్న తండెల్ సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణం సినిమాలో సాయి పల్లవి, యష్, రణబీర్ కపూర్ నటిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ రాముడు పాత్రలో కనిపించగా, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నట్లు సమాచారం. ఇక సాయి పల్లవి, యష్ కాంబినేషన్లో రాబోయే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading