Home » భోళాశంకర్ సినిమాలో “కీర్తి సురేష్” పాత్రకి ముందుగా ఆ హీరోయిన్ ను అనుకున్నారా? కానీ?

భోళాశంకర్ సినిమాలో “కీర్తి సురేష్” పాత్రకి ముందుగా ఆ హీరోయిన్ ను అనుకున్నారా? కానీ?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

మెగాస్టార్ చిరంజీవి అరవైలోనూ ఫుల్ ఫామ్ లో దూసుకు పోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించారు… ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా మరియు కీర్తి సురేష్ లు కూడా నటించారు. ఎన్నో అంచనాలతో విడుదల అయిన భోళా శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

Advertisement

అయితే.. ఈ సినిమా గురించిన చర్చలు మాత్రం ఆగలేదు. ఈ సినిమాలో నటీనటుల పాత్రల గురించి, సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయాల గురించి చర్చలు వస్తూనే ఉన్నాయి. మెహర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా.. కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలిగా కనిపించి మెప్పించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ మరియు చిరంజీవిల మధ్య అన్నా చెల్లి సంబంధాలను చూపే ఎమోషనల్ సీన్స్ చాలానే ఉన్నాయి.

Advertisement

అయితే.. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన చెల్లెలి పాత్ర కోసం మరో హీరోయిన్ ను అనుకున్నారట. ఆమె ఎవరో కాదు నాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా మొదట సాయి పల్లవిని తీసుకోవాలని అనుకున్నారు. అయితే సాయి పల్లవి మెగాస్టార్ పక్కన నటించే స్థాయి తనకి లేదని, ఆయనపై గౌరవంతో ఈ సినిమాను రిజెక్ట్ చేస్తున్నట్లు తెలిపింది. దీనితో ఆ పాత్ర కోసం కీర్తి సురేష్ ను తీసుకున్నారు. సాయి పల్లవి ఈ సినిమా ఒప్పుకోకుండా మంచి పని చేసింది అంటూ ఆమె ఫాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

రాత్రిపూట మృతదేహాన్ని ఒంటరిగా ఉంచకూడదు ఎందుకో తెలుసా..?

అధికమాస అమావాస్య నాడు ఈ తప్పులు ఎట్టి పరిస్థితిలో చేయకండి..! శివుని ఆగ్రహానికి లోనవుతారు..!

Chanikya niti : విజయవంతమైన వ్యాపారవేత్త కావాలంటే ఈ లక్షణాలు మీలో కచ్చితంగా ఉండాలి..!

Visitors Are Also Reading