Home » సాయి పల్లవికి ఎప్పుడు కోపం వస్తుందో తెలుసా….?

సాయి పల్లవికి ఎప్పుడు కోపం వస్తుందో తెలుసా….?

by Azhar
Ad

సాయి పల్లవికి మన తెలుగులో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం అందరికి తెలుసు. అయితే తాజాగా సాయి పల్లవి నటించిన గార్గి అనే సినిమా విడుదలై ప్రజల ముందుకు వచ్చింది. ఇక దీని కంటే ముందు వచ్చిన సాయి పల్లవి విరాటపర్వం సినిమా నేతగా ఆడకపోవడంతో.. సాయి పల్లవి ఈ సినిమాపైనే తన హోప్స్ అనేవి పెట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదల అయిన తర్వాత మంచి పాజిటివ్ టాక్ అనేది తెచ్చుకుంది. అలాగే ఇందులో సాయి పల్లవి నటనకు 100 శాతం మార్కులు అనేవి పడ్డాయి.

Advertisement

ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడ గార్గి సినిమాకు సంబధించిన అనేక విషయాలను బయటపెట్టింది. అలాగే ఈ సినిమాలో తన రోల్ ఎంత ఛాలెంజింగ్ గా ఉంది అనేది పేర్కొంది. అదే విధంగా తనకు నిజ జీవితంలో కోపం ఎప్పుడు వస్తుంది అనేది బయటపెట్టింది. మాములుగా సాయి పల్లవి ఎప్పుడు నవ్వుతూనే కనిపిస్తుంది. చాలా మంది ఆర్టిస్టులు ఎప్పుడో ఒక్కసారి బయట కోపాన్ని ప్రదర్శించిన వీడియోలు అనేవి బయటకు వచ్చాయి. కానీ సాయి పల్లవివి మాత్రం ఎప్పుడు రాలేదు.

Advertisement

దాంతో సాయి పల్లవికి అసలు కోపం రాదు అనే ఆనోచనలో అభిమానులు ఉన్నారు. కానీ ఇప్పుడు తనకు కూడా కోపం వస్తుంది అని సాయి పల్లవి పేర్కొంది. ఈ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. నాకు కోపం అనేది మాములుగా రాదు. నేను ఎప్పుడు ఎవరి మీద నా కోపం అనేది చూపించాను. కానీ నా నిద్రను ఎవరైనా పాడుచేస్తే మాత్రం విపరీతమైన కోసం వస్తుంది. నేను నిద్రపోతున్న సమయంలో నన్ను ఎవరు డిస్ట్రబ్ అనేది చేయకూడదు అని సాయి పల్లవి తెలిపింది. ఇక ఈ విషయం తెలుసుకుని అభిమానులు.. సాయి పల్లవికి కోపం వస్తే ఎలా ఉంటుంది చూడాలనుకుంటున్నట్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

పంత్ విషయంలో మళ్ళీ వక్ర బుద్ధి చూపించిన ఇంగ్లాండ్ బోర్డు..!

రీ-ఎంట్రీ ఇస్తా అంటున్న పాక్ పేసర్ మహమ్మద్ అమీర్…!

Visitors Are Also Reading