Home » బాలయ్యలో ఉన్న గొప్ప విషయాన్ని వెల్లడించిన సాయి మాదవ్ బుర్రా..!

బాలయ్యలో ఉన్న గొప్ప విషయాన్ని వెల్లడించిన సాయి మాదవ్ బుర్రా..!

by Anji
Published: Last Updated on
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ విజయం తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. గోపిచందు మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేనీ, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు.  ఇప్పటికే వీరసింహారెడ్డి ఆల్బమ్ హిట్ అయింది. టీజర్ లో వినిపించిన డైలాగులు అదుర్స్ అనిపించాయి. ఎంతో ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న వీరసింహారెడ్డి జనవరి 12, 2023న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి మాటలు అందించిన స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 

Advertisement

“వీరసింహారెడ్డిలో పక్కా మాస్ డైలాగులున్నాయి. బాలయ్యని అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో, ఎలాంటి డైలాగ్ లను వినాలనుకుంటారో అవన్ని ఇందులో ఉన్నాయి. బాలకృష్ణ నాలుగు సినిమాలకు నేను పని చేశాను. గౌతమిపుత్రశాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, వీరసింహారెడ్డి. నేను ఎప్పుడు కూడా ఒత్తిడి తీసుకోలేదు. ఒత్తిడికి గురైనట్టయితే ఔట్ పుట్ సరిగ్గా రాదని నమ్ముతాను. కథ, పాత్రని సన్నివేశాన్ని హీరో ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ రాయాలి. వీరసింహారెడ్డి కథ చర్చల ప్రారంభం నుంచి ఈ ప్రాజెక్ట్ లో ఉన్నానని అన్నారు. 

Advertisement

Also Read :  మీ కంటి చూపు సరిగ్గా కనిపిస్తుందా? అయితే ఈ ఫోటోలో దాగి ఉన్న కుందేలును గుర్తించండి ? 

వీరసింహారెడ్డి కథే కొత్తది. ఈ కథలో ప్రేక్షకులు ఇంతకు ముందు చూడని ఓ అద్భుతమైన కొత్త పాయింట్ ఉందని.. మాస్ ఆడియన్స్ కి క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కి అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. వీరసింహారెడ్డి పుల్ ఫ్యాకేజ్ బాలకృష్ణ సినిమాల నుంచి కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. నాకు ప్రతీ కథ ఓ సవాలే. ఓ సినిమాకి రాస్తున్నప్పుడు సవాల్ గా తీసుకునే రాస్తాను. కథలో ఉన్న సోల్ ని ఎలివేట్ చేయడానికి ప్రతీ రచయిత కష్టపడుతాడు. వీరసింహారెడ్డి కథ చాలా కొత్తది. ముఖ్యంగా ఇందులో అద్భుతమైన సోల్ ఉంటుంది. ఇక ఈ పాయింట్ వింటే ఎవరైనా సరే స్ఫూర్తి పొందుతారు. పక్కా కమర్షియల్ చిత్రానికి ఇలాంటి కథ చాలా అరుదుగా లభిస్తుంది. ఈ కథ వినగానే నేను చాలా హ్యాపీగా పీలయ్యాను. వీరసింహారెడ్డికి డైలాగ్స్ రాయడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టింది. ప్రధానంగా బాల  కృష్ణ వద్ద ఉన్న గొప్ప విషయం ఏంటంటే.. ఒకసారి కథకి ఓకే చెప్పిన తరువాత అందులో ఆయన వేలు పెట్టరు” అని చెప్పుకొచ్చారు సాయి మాధవ్ బుర్రా. 

Also Read :  శ్రీ ముఖి డ్రెస్ పై స్టార్ హీరోయిన్ సంచలన పోస్ట్

Visitors Are Also Reading