Home » పుడితే “స‌ద‌ర్” దున్న‌పోతులా పుట్టాలి..రోజూ 3కిలోల డ్రై ఫ్రూట్స్, వారానికో స్కాచ్ బాటిల్..!

పుడితే “స‌ద‌ర్” దున్న‌పోతులా పుట్టాలి..రోజూ 3కిలోల డ్రై ఫ్రూట్స్, వారానికో స్కాచ్ బాటిల్..!

by AJAY
Ad

హైద‌రాబాద్ న‌గ‌రంలో దీపావ‌ళి పండుగ త‌ర్వాత రోజున అట్ట‌హాసంగా యాద‌వులు జ‌రుపుకునే పండుగ సద‌ర్ ఈ పండుగ పేరు చాలా మందికి తెలుసు కానీ ఎందుకు పండుగ జ‌రుపుకుంటారో తెలియదు. యాద‌వుల చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే యాదు అనే రాజు సంతానం అవ్వ‌డం వ‌ల్ల యాద‌వుల‌కు ఆ పేరు వ‌చ్చిన‌ట్టు చరిత్ర చెబుతోంది. అంతే కాకుండా శ్రీకృష్ణుడి ఆలనా పాలనా యాద‌వులు చూసుకున్న‌ట్టు చ‌రిత్ర చెబుతోంది. ఇక ఆల మందలు యాద‌వుల‌కు కుటుంబంతో స‌మాధానం. స‌ద‌ర్ అంటే ముఖ్య‌మైన‌ద‌ని అర్థం. ఒక‌ప్పుడు డ‌బ్బు లేని కాలంలో వ‌స్తు మార్పిడి విధానం ఉండేది. వ‌స్తుమార్పిడి విధానంలో ప‌శువులను ఎక్కువ‌గా ఉప‌యోగించే వారు. కాబ‌ట్టి ప‌శువుల‌ను స‌ద‌ర్ అనేవారు. వాటి కోసం ఓ ఉత్స‌వాన్ని నిర్వ‌హిస్తూ దానికి స‌ద‌ర్ అనే పేరును పెట్టారు.

sadar buffalo cost life style

sadar buffalo cost life style

ఈ ఉత్స‌వాల‌ను అనాదిగా ఆల మంద‌ల‌ను ప్రేమించే యాద‌వులే నిర్వ‌హిస్తున్నారు. అదే విధంగా వ్యాపార లావా దేవీలు ఎక్కువగా జ‌రిగే ముఖ్య‌మైన ప్రాంతాల‌ను కూడా స‌ద‌ర్ అని అంటారు. ఇక న‌గ‌రంలో అలాంటి ప్రాంతాలు చాలానే ఉండగా ఆ ప్రాంతాల్లోనే స‌ద‌ర్ ఉత్స‌వాల‌ను జ‌రుపుతారు. ఇక ఈ ఉత్స‌వాల్లో ముర్రాజాతికి చెందిన దున్న‌పోతుల‌ను వాడుతుంటారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో జరుగుతున్న స‌ద‌ర్ ఉత్స‌వాల‌కు భార‌త్ లోనే అత్యంత ఎత్తైన బాహుబ‌లి దున్న‌పోతును తీసుకువ‌స్తున్నారు. హ‌ర్యానాకు చెందిన ఈ దున్నపోతు ఎత్తు బ‌రువు చూసి దానికి బాహుబలి అని పేరుపెట్టిన‌ట్టు దాని య‌జ‌మాని చెబుతున్నాడు. ఇక ఆ దున్న‌పోతు లైఫ్ స్టైల్ చూస్తే పుడితే దున్న‌పోతులా పుట్టాలి అనే రేంజ్ ఉంద‌నే చెప్పాలి.

Advertisement

Advertisement

బాహుబ‌లి దున్న‌పోతుకు దాని య‌జ‌మాని ప్ర‌తిరోజు మూడు కిలోల డ్రైఫ్రూట్ ల‌ను ఆహారంగా పెడ‌తాడ‌ట‌. దాంతో పాటు మూడు లీటర్ల పాల‌ను ఆహారంలో భాగంగా ఇస్తార‌ట‌. అంతే కాకుండా వారానికోసారి స్కాచ్ ఫుల్ బాటిల్ తాగిస్తాడ‌ట‌. వారానికోసారి స్కాచ్ తాగించ‌డం వ‌ల్ల దాని జీర్ణ వ్య‌వ‌స్థ తీరు బాగుంటుంద‌ని య‌జ‌మాని చెబుతున్నాడు. అంతే కాకుండా వారినికోసారి బాదం నూనెతో బాహుబ‌లి దున్న‌కు మ‌సాజ్ కూడా చేయిస్తారట‌. అదేవిధంగా ప్ర‌తిరోజు స్విమ్మింగ్..వాకింగ్ లాంటి వ్యాయామం కూడా ఉంటుంద‌ట‌. దాని కోసం ప్ర‌తిరోజు 7వేల‌ను ఖ‌ర్చు చేస్తాన‌ని య‌జ‌మాని చెబుతున్నాడు. ఇక స‌ద‌ర్ దున్న‌పోతు స్టోరీ తెలిసివాళ్లు ఒక్క జ‌న్మ‌లో అయినా స‌ద‌ర్ దున్న‌పోతులా పుడితే బాగుండ‌ని అనుకుంటున్నారు.

Visitors Are Also Reading