గతేడాది అక్టోబర్ లో 50 ఏళ్ల వ్యక్తిని 25ఏళ్ల యువతి పెళ్లి చేసుకున్న వార్త దేశవ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 50 ఏళ్ల వ్యక్తిని 25ఏళ్ల యువతి పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ నెట్టింట ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇక ఆ యాబై ఏళ్ల వ్యక్తి పేరు శంకరప్ప కాగా యువతి పేరు మేఘన…..కర్నాటకలోని తమకూరు జిల్లా కు చెందిన శంకరప్ప భార్య కొన్నేళ్ల కిందట మృతి చెందింది.
Advertisement
ఆ తరవాత రెండో పెళ్లి చేసుకోవాలని శంకరప్ప నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో 25 ఏళ్ల మేఘన శంకరప్ప ను వివాహం చేసుకునేందుకు ముందుకు వచ్చింది. ఆమెకు కూడా అప్పటికే వివాహం కాగా భర్తతో విడిపోయినట్టు తెలుస్తోంది. వీరు గతేడాది అక్టోబర్ లో వివాహం చేసుకోగా ఇద్దరూ దండలు మార్చుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక వీరి వివాహం జరిగి 5 నెలలు అవుతుండగా ఇప్పుడు శంకరప్ప ఆత్మహత్య చేసుకుని మరణించడం హాట్ టాపిక్ మారింది.
Advertisement
శంకరప్ప తమ ఊరికి దగ్గరలోని కుణిగల్ తాలూకా హులియూర్ గ్రామంలో మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్యకు కారణం ఓ కుక్క వల్ల వచ్చిన గొడవేనని వార్తలు వినిపిస్తున్నాయి. మేఘన ఓ కుక్కను పెంచుకోవాలని అనుకోగా దానికి శంకరప్ప తల్లి నిరాకరించిందట. దాంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొనడంతో శంకరప్ప ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
ALSO READ : ట్రాఫిక్ రూల్స్ ఉల్లంగించి అడ్డంగా బుక్కైన మంచు మనోజ్…1
మరోవైపు శంకరప్ప తల్లి తన కుమారుడి చావుకు కోడలు మేఘనే కారణం అని చెబుతోంది. కోడలే తన కుమారుడిని హత్య చేయించిందని ఆరోపిస్తోంది. అయితే మేఘన మాత్రం తను వేరే కులానికి చెందిన యువతి కావడంతో మొదటి నుండి అత్త వేధింపులకు గురిచేస్తోందని ఆరోపిస్తోంది. పెళ్లి తరవాత తన భర్తతో ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు చెబుతోంది. తన అత్త వల్లే కుటుంబంలో గొడవలు వచ్చాయని దాంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది.