ఐపీఎల్ 2022 సీజన్ నేటితో ముగియనుంది. అయితే మనకు ఈ ఐపీఎల్ సీజన్ లో చాల మంది యువ ఆటగాళ్లు కనిపించరు. నదుల్లో కొంత మంది అద్భుతమైన ప్రదర్శనలతో జట్టును ఆదుకున్నారు. అలాగే అందరి మనస్సు గెలుచుకున్నారు. అందులో ఒక్కడే తిలక్ వర్మ. హైదరాబాద్ కు చెందిన ఈ యువ ఆటగాడిని ఐపీఎల్ మెగవేలంలో ముంబై ఇండియన్స్ జట్టు దకించుకుంది. అలాగే మొదటి మ్యాచ్ లోనే అవకాశం ఇచ్చింది. అందులో మంచి ప్రషర్షణ చేసిన తిలక్ ను ముంబై అన్ని మ్యాచ్ లలో రెగ్యులర్ గా ఆడిస్తూ వచ్చింది.
Advertisement
అయితే ముంబై ఈ సీజన్ లో మంచి ప్రదర్శన చేయకపోయినా.. వరుస ఓటములతో సతమతమైన తిలక్ మాత్రం మంచి ప్రదర్శనలు చేస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు తిలక్ బ్యాటింగ్ కు క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఫిదా అయిపోయాడు. తాజాగా సచిన్ తిలక్ గురించి మాట్లాడుతూ… తిలక్ మంచి పాజిటివ్ ప్లేయర్. నేను అతని బ్యాటింగ్ ను గమనించాను. అతను ముంబై కోసం ట్రయిల్ గేమ్స్ ఆడేటప్పుడు అతడిని చూసాను. తిలక్ చాలా సులువుగా షాట్స్ ఆడుతాడు. ఎప్పుడు బేసిక్స్ తన మైండ్ లో ఉంచుకుంటాడు.
Advertisement
అయితే తిలక్ మంచి బ్యాటర్ మాత్రమే కాదు. బౌలర్ కూడా. కానీ ఈ సీజన్ లో అతను బౌలింగ్ చేసింది కేవలం రెండు ఓవర్లు మాత్రమే. కానీ అతను దేశవాళీ టోర్నీలలో బౌలింగ్ లో కూడా మంచి ప్రదర్శన చేసాడు. కాబట్టి నేను ఏం కోరుకుంటున్నాను అంటే.. తిలక్ మొత్తం బ్యాటయింగ్ పైనే కాకుండా తన బౌలింగ్ పైన కూడా దృష్టి పెట్టాలి. అవసరమైన సమయంలో టీ20 మ్యాచ్ లలో ఓ రెండు ఓవర్లు వేయగలగాలి. తిలక్ చాలా కష్టపడగలడు. అందుకే అతను తన ఫామ్ ను ఇలానే కొనసాగించాలి అని నేను కోరుకుంటున్నాను అని సచిన్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :