లెజెండ్రీ క్రికెటర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కోట్లాది మంది మనసులను దోచుకున్నారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఆయన కూడా ఒకరు ఏప్రిల్ 24 1973న బొంబాయి లోని దాదర్‌లోని మరాఠీ నవల రచయిత, కవి రమేష్ టెండూల్కర్ రజనీ దంపతులకు పుట్టారు, చిన్నప్పటినుండి సచిన్ క్రికెటర్ అవ్వాలని అనుకున్నారు. పదహారేళ్ల వయసులో కెరియర్ ని స్టార్ట్ చేశారు. లెక్కలేనన్ని రికార్డులని సచిన్ టెండూల్కర్ సృష్టించారు. 1995లో సచిన్ టెండూల్కర్ అంజలి మహిత ని పెళ్లి చేసుకున్నారు.
Advertisement
Also read:
వీళ్ళ ప్రేమ కథ చాలా ఆసక్తికరంగా ఉంది సచిన్ అంజలికి 1997లో సారా టెండూల్కర్ పుట్టారు. అర్జున్ టెండూల్కర్ 1999లో పుట్టారు. సచిన్ జీవితం లో అన్నీ ఒడిదుడుకుల్లో అంజలి ఎప్పుడు కూడా పాలుపంచుకునేవారు. సచిన్ కంటే అంజలి ఆరేళ్లు పెద్దదైనప్పటికీ వయసు ఎప్పుడు కూడా వాళ్ళ బంధానికి అడ్డు రాలేదు. నాకు క్రికెట్ మీద ఆసక్తి లేదు. సచిన్ చాలా క్యూట్ గా వున్నాడు అనుకున్నాను. ఆ రోజుల్లో విమానాశ్రయంలో విఐపి లను చూడడం కోసం ప్రేక్షకుల గ్యాలరీ ఉండేది.
Advertisement
Also read:
ఇంగ్లాండ్ నుండి దిగిన మా అమ్మ కోసం వెతుకుతున్నాను అప్పుడు సచిన్ ని చూడగానే సచిన్ అని అరుస్తూ అతని వెంట పరిగెత్తాను. సచిన్ చాలా ఇబ్బంది పడ్డాడని అంజలి అన్నారు. నేను మెడిసిన్ చదువుతున్నాను నాతో పాటు చదువుకుంటున్న స్నేహితుడు కూడా క్రికెట్ ఆడాడు. ఎలా అయినా సచిన్ నెంబర్ కావాలని అడిగాను. ఇలా సచిన్ టెండూల్కర్ కి ఫోన్ చేశానని, చాలా సార్లు ఫోన్ చేసినా సచిన్ కాల్ ఆన్సర్ చేయలేదని ఒకసారి ఫోన్ చేస్తే సచిన్ స్వయంగా నన్ను మీట్ అయ్యాడని అన్నారు. ఎయిర్ పోర్ట్ లో పరిచయమైన అమ్మాయిగా నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఆయన మారువేషంలో నన్ను కలిశారు అని అంజలి చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!