Home » గంగూలీ వల్లే ఇప్పుడు టీం ఇండియా ఇలా ఉంది..!

గంగూలీ వల్లే ఇప్పుడు టీం ఇండియా ఇలా ఉంది..!

by Azhar
Ad

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒక్కటి అనేది అందరికి తెలుసు. ఇప్పుడు ఉన్న ఈ టీం ఇండియా వేరే దేశాలకు వెళ్లి అక్కడ వారి సొంత గడ్డ పైన వారిని ఓడించగలేదు. కానీ ఇందుకు కారణం ఎవరు అంటే అందరూ చెప్పే పేరు సౌరవ్ గంగూలీ. భారత జట్టుకు గంగూలీ కెప్టెన్ అయిన తర్వాతే జట్టు విదేశాలలో విజయాలు సాధించడం నేర్చుకుంది. అలాగే ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను దాదానే టీం ఇండియాలోకి తీసుకువచ్చాడు అనేది అందరికి తెలుసు. ఈ విషయంలోనే గంగూలీ పై సచిన్ ప్రశంసలు కురిపించాడు.

Advertisement

తాజాగా ఓ కార్యక్రమంలో సచిన్ మాట్లాడుతూ… జట్టును ఎలా బ్యాలెన్స్ చేయాలి అంది గంగూలీకి బాగా తెలుసు. అందుకే టీం ఇండియా యూక అత్యుత్తమ కెప్టెన్ లలో గంగూలీ కూడా ఉంటాడు. అయితే గంగూలీ కెప్టెన్ అయిన సమయంలోనే భారత క్రికెట్ అనేది ఎదుగుతుంది. కాబట్టి జట్టుకు అది చాలా కీలకమైన దశ. అటువంటి సమయంలో కెప్టెన్ గా పగ్గాలు అందుకున్న దాదా.. జట్టును బాగా నడిపించాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛ అనేది ఇచ్చాడు. అలాగే వారు ఏం చేయాలో వారికీ క్లారిటీగా చెప్పి.. ఆ బాధ్యతలను వారికే అప్పగించాడు.

Advertisement

అదే విధంగా గంగూలీ ఎంతో మంది ఆటగాళ్లను కట్టుకు పరిచయం చేసాడు. సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా వంటి ఆటగాళ్లు అందరూ ఆ లిస్ట్ లోకే వస్తారు. వారందరు ఇప్పుడు స్టార్ ఆటగాళ్లు కావచ్చు. కానీ జట్టులోకి వచ్చినప్పుడు తప్పకుండ వారికీ సపోట అనేది కావాలి. గంగూలీ అది అందరికి కరెక్ట్ గా ఇచ్చాడు కాబట్టే వారు సక్సెస్ కాగా గలిగారు అని సచిన్ అన్నాడు. ఇక దాదా జట్టులో ఉన్న ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం , స్వేచ్ఛ ఇచ్చాడు. చిన్న ఆటగాడు కావచ్చు.. పెద్ద ఆటగాడు కావచ్చు అందరి మాటలను వినేవాడు అని సచిన్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

దారుణంగా కోహ్లీ పరిస్థితి.. 6 ఏళ్ల తర్వాత మళ్ళీ..?

ఉమ్రాన్ ప్రపంచ కప్ జట్టులో.. క్లారిటీ ఇచ్చిన రోహిత్..!

Visitors Are Also Reading