క్రికెట్ ను మరింత ఆసక్తిగా మార్చేందుకు 1971 జనవరి 05న వన్డే క్రికెట్‌ను ప్రారంభించారు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే జరిగింది. ఇది జరిగిన 39 ఏళ్ల తరువాత అంటే 2010లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఎవరూ ఊహించని రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ ప్రపంచంలో దేవుడుగా పేరుగాంచిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఫిబ్రవరి 24, 2010లో వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు.
Also Read : బిడ్డ మరణంతో కన్నీరు మున్నీరైన తల్లి కొండముచ్చు..!
Advertisement
దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్ 147 బంతుల్లో 200 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 25 ఫోర్లు, మూడు సిక్సర్ల ద్వారా పరుగులు వచ్చాయి. దీంతో భారత జట్టు 50 ఓవర్లలో మూడు వికెట్లకు 401 పరుగులు చేసింది. సచిన్ తో పాటు దినేష్ కార్తీక్ 79, యూసూప్ పఠాన్ 36, కెప్టెన్ ఎం.ఎస్. ధోని 35 బంతుల్లో 68 పరుగులు చేశాడు.
Advertisement
భారత్ నిర్దేశించిన 402 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 248 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే డివిలియన్స్ తన జట్టు తరుపున అజేయంగా 114 పరుగులు చేశాడు. అదే సమయంలో భారత్ తరుపున శ్రీశాంత్ అత్యధికంగా మూడు వికెట్లను తీశాడు. సచిన్ 200 పరుగులు సాధించి నేటికి 12 సంవత్సరాలు.
Also Read : ఆర్‌సీబీ కెప్టెన్సీ కోహ్లీ వదిలేసినట్టు ఎందుకు ప్రకటించారో తెలుసా..?
THREAD (1/2)
BALL BY BALL Final Oval when @sachin_rt made 1st ever ODI 200. I'm sure you've seen the highlights many times but relive the entire magic ball by ball here in this thread. pic.twitter.com/Hk82XP0aGK— Mainak Sinha🏏📽️ (@cric_archivist) February 24, 2022