Home » ఆర్‌సీబీ కెప్టెన్సీ కోహ్లీ వ‌దిలేసిన‌ట్టు ఎందుకు ప్ర‌క‌టించారో తెలుసా..?

ఆర్‌సీబీ కెప్టెన్సీ కోహ్లీ వ‌దిలేసిన‌ట్టు ఎందుకు ప్ర‌క‌టించారో తెలుసా..?

by Anji
Ad

ఐపీఎల్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు ఏళ్ల త‌ర‌బ‌డి సారథ్యం వ‌హించిన విరాట్ కోహ్లీ గ‌త సీజ‌న్‌లో ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. టీమిండియా వ‌న్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొల‌గించ‌డానికి ముందు భార‌త జ‌ట్టు భార‌త జ‌ట్టు టీ-20 జ‌ట్టు కెప్టెన్సీ నుంచి కూడా త‌ప్పుకున్నాడు. ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-2తో కోల్పోయిన త‌రువాత టెస్ట్ కెప్టెన్సీకి కూడా కోహ్లీ రాజీనామా చేశాడు. దీంతో ఇప్పుడు ఇటు ఇండియా జాతీయ జ‌ట్టుతో పాటు అటు బెంగ‌ళూరు జ‌ట్టులోనూ సాధార‌ణ ఆట‌గాడిగా మారిపోయాడు.

Also Read :  Viral Video : ప్ర‌పంచం చూపు మొత్తం చూపు ఆ జ‌ర్న‌లిస్ట్ వైపే..!

Advertisement

Advertisement

దీంతో ఇప్పుడు ఇటు ఇండియా జాతీయ జట్టుతోపాటు అటు బెంగళూరు జట్టులోనూ సాధారణ ఆటగాడిగా మారిపోయాడు. ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌డంపై కోహ్లీ మాట్లాడుతూ క్రికెట‌ర్లు తీసుకునే నిర్ణ‌యాలు బ‌య‌టివాళ్లు అర్థం చేసుకోవ‌డం క‌ష్టం అని పేర్కొన్నారు. త‌న నిర్ణ‌యం చుట్టూ అల్లుకున్న ఊహాగానాల‌ను కొట్టి ప‌డేశాడు. తాను ఎంత చేయ‌గ‌ల‌నో అంతే చేస్తాను అని, అంత‌కు మించిన వాటిని ప‌ట్టుకుని ఊగిస‌లాడే వ్య‌క్తిని కాద‌ని పేర్కొన్నాడు.

తాను ఇంకా ఎక్కువ చేయ‌గ‌ల‌న‌ని త‌న‌కు తెలిసినప్ప‌టికీ దానిని తాను ఆస్వాదించిన‌ట్ట‌యితే ఆ ప‌ని చేయ‌బోన‌ని కోహ్లీ స్పష్టం చేశాడు. ప్ర‌జ‌లు మీ ప‌రిస్థితిలో ఉంటే త‌ప్ప మీరు తీసుకునే నిర్ణ‌యాల‌ను అర్థం చేసుకోవ‌డం చాలా క‌ష్టం అని.. ఎందుకంటే వారి అంచ‌నాలు, అభిప్రాయాలు వారికి ఉంటాయ‌ని చెప్పాడు. వాస్త‌వానికి ఈ విష‌యంలో ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం ఏమి లేద‌ని పేర్క‌న్నాడు కోహ్లీ. త‌న‌కు కొంత స్పేస్‌కావాల‌ని, త‌న ప‌ని భారాన్ని నిర్వ‌హించుకోవాల‌నుకుంటున్నాన‌ని అక్క‌డితో ఆ క‌థ ముగిసింద‌ని కోహ్లీ వివ‌రించాడు.

Also Read :  Womens World Cup : అవ‌స‌ర‌మైతే తొమ్మిది మందితోనే..!

Visitors Are Also Reading