ఐపీఎల్ 2023 మార్చి 31న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇవాళ్టి వరకు ఐపీఎల్ మ్యాచ్ లన్నియూ చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇక ఈ తరుణంలో.. ఐపీఎల్ 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బోణీ కొట్టింది. ఐపీఎల్ లో భాగంగా గత రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల ఖాతా తెరిచింది.
READ ALSO : Twitter Logo : ట్విట్టర్ లోగో మారింది.. పిట్ట స్థానంలో కుక్క వచ్చిందోచ్
Advertisement
గుజరాత్ జెయింట్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో వీరవిజృంభన చేసిన చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వరుసగా రెండో మ్యాచ్ లో బ్యాటు జులిపించాడు. 31 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 57 పరుగులు చేసి వరుసగా రెండో అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో ఋతురాజ్ లాగిపెట్టి కొట్టిన బంతి స్టేడియంలో ప్రదర్శనకు ఉంచిన కారుకు తగిలి సోట్టపడింది. కృష్ణప్ప గౌతమ్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతిని గైక్వాడ్ స్టాండ్స్ లోకి పంపాడు.
Advertisement
అక్కడ ప్రదర్శనకు ఉంచిన కారును బంతి బలంగా తాకడంతో దానికి సోట్టపడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే… ఆ కారును బద్దలు కొట్టినందుకు.. గైక్వాడ్ కే రూ.5 లక్షల డొనేషన్ ఆ కారు కంపెనీ ఇచ్చింది. ఇలా డబ్బులు ఇవ్వడం క్రికెట్ లో రూల్. కాగా.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై గైక్వాడ్, డెవోన్ కాన్వే దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 218 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జేయింట్స్ పోరాడి ఓ డింది. 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది.
READ ALSO : నా బాడీ, బరువుపై ట్రోల్స్ చేస్తున్నారు-హనీ రోజ్