ఉక్రెయిన్‌పై నెల రోజుల పాటు యుద్దోన్మాదంతో రెచ్చిపోయిన రష్యా అనూహ్యంగా ఓ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌పై వార్ తొలి దశ ముగిసిందని పేర్కొంది. తూర్పుడాన్‌బాస్ ప్రాంతాలపై దృష్టి సారిస్తామని రష్యన్ మిలటరీ ప్రకటించింది. డొంటెస్క్, లుహాంస్క్‌ల్లో రష్యా అనుకూల తిరుగుబాటుదాల ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. పూర్తి స్థాయిలో వీటిని ఆక్రమించేందుకు వ్యూహం మార్చింది మాస్కో. ఉక్రెయిన్ ప్రతిఘటనతో విసిరిపారేస్తున్న రష్యన్ మిలిటరీ చిన్న చిన్న లక్ష్యాల వైపు అడుగువేయాలని వ్యూహం మారుస్తున్నట్టు కనపడుతోంది.
క్రిమియా తరహాలో డాన్‌బాస్ ప్రాంతాన్నీ పూర్తిగా తమ కంట్రోల్ తెచ్చుకునేందుకు ప్లాన్ మార్చింది. ఫస్ట్ ఫేజ్‌లో తమ ప్రధాన లక్ష్యం అసంపూర్తిగా ముగిసిందని రష్యన్ జనరల్ స్టాప్ అధిపతి ఒప్పుకున్నారు. ఉక్రెయిన్ సైనిక సామర్థ్యాన్ని వీలైనంత కుదించామన్న రష్యా మిగతా ఫోకస్ మొత్తం డాన్‌బాస్ పైనేనని తెలిపింది.
Advertisement
Advertisement
Also Read : IPL 2022 : మూడేండ్ల తరువాత ఎం.ఎస్ ధోనీ హాఫ్ సెంచరీ..!
ఉక్రెయిన్ రష్యా సమరం సాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు యకూరప్ పర్యటన పుతిన్‌ను మిరంత వేడెక్కిస్తోంది. ఇప్పటికే స్లోవేకియా, పోలాండ్, హంగేరి, బల్గేరియాలకు అదనపు దళాలు పంపాలని నాటో నిర్ణయించింది. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామన్నారు బైడెన్. ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్‌లో తాజాగా పర్యటించారు బైడెన్. అమెరికా సైనికుల స్థావరాన్ని సందర్శించారు. లక్షలాది ఉక్రెయిన్ శరణార్థులను పోలాండ్ అక్కున చేర్చుకుంటోందని అభినందించారు అమెరికా అధ్యక్షుడు బైడెన్.
Also Read : Rajamouli ఇండస్ట్రీకి పరిచయం చేసిన విలన్స్! ఒక్కో సినిమాలో ఒక్కరు!