ఐపీఎల్ 15లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో కొన్ని ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తడబడింది. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. కోల్‌కతా జట్టుకు 132 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Advertisement
తొలుత ఒకరి వెనుక ఒకరు ఔట్ కావడంతో చెన్నై కష్టాల్లో ఉంది. ఆ సమయంలో ధోనీ రాకతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. అసలు 120 పరుగులు అన్నా చెన్నై చేస్తుందా అనే సందేహాలు కలిగిన వేళలో ఆ జట్టు ఏకంగా 131 పరుగులు చేసింది. ధోనీ (50 నాటౌట్), జడేజా (26 నాటౌట్) భాగస్వామ్యంతో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 131 పరుగులు చేసింది. కోల్‌కతా ముందు 132 పరుగుల టార్గెట్ నిలిచింది.
Advertisement
Advertisement
కోల్‌కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా.. రస్సెల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. ధోనీ చివరగా 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో దాదాపు మూడేళ్ల తరువాత ధోనీ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. కెప్టెన్‌గా తప్పుకున్న తొలి మ్యాచ్‌లోనే ధోనీ తన మార్క్ చూపించాడంటూ చెన్నై అభిమానులు సంబర పడుతున్నారు.
Also Read : ఈ ఫోటోలో ఉన్న బాబు ప్రస్తుతం ఓ స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..!