రష్యాతో ఒప్పందంపై చర్చించడానికి తాము సిద్ధం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. యుద్ధాన్ని రష్యా విరమించేటట్టయితే నాటోలో సభ్యత్వ ప్రయత్నాలను తాము విరమించుకునే అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు మంగళవారం ఉక్రెయిన్ టీవీ ఛానళ్లకు ఇచ్చిన ముఖాముఖీలో తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నేరుగా చర్చలు జరగాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. ఈ యుద్ధాన్ని రష్యా ఆపాలనుకుంటుందని లేనిదీ అర్థం చేసుకోవడం అసాధ్యం అని తేల్చిచెప్పారు.
Advertisement
Advertisement
క్రిమియా స్థితిపై రష్యా మద్దతు ఉన్న ఏర్పాటు వాదుల నియంత్రణలోని తూర్పు డాన్‌బాస్ ప్రాంతంపైనా చర్చకు సంసిద్ధత వ్యక్తం చేసారు జెలెన్ స్కీ. తమపై దాడిని విరమించడం సహా భద్రతపరమైన హామీలను ఇచ్చినట్టయితే ఇవన్నీ జరుగుతాయని స్పష్టం చేసారు. వివిధ దేశాల చట్ట సభ సభ్యులతో హామీలను ఇచ్చినట్టయితే ఇవన్నీ జరుగుతాయని స్పష్టం చేశారు. వివిధ దేశాల చట్టసభ సభ్యులతో మాట్లాడుతున్న జెలెన్ స్కీ ఆ తరుణంలో ఇటలీ ఎంపీలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
మనుగడ కోసం తాము యుద్ధం చరేస్తున్నామని, తమను జయించడం ద్వారా ఐరోపాకు ప్రవేశ మార్గాన్ని ఏర్పరచుకోవాలనేది రష్యా ప్రయత్నం అనేది చెప్పారు. రెండు దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా పోప్ ప్రాన్సిస్‌ను కోరారు. సహాయ కారిడార్లను సయితం రష్యా అడ్డుకుంటోందని సంక్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయని పోప్‌నకు వివరించినట్టు ఆయన ట్వీట్ చేసారు.