శాంతి చర్చలు అంటూనే అణుబాంబులు సిద్ధంచేయాలన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కి పడేవిధంగా చేసింది. రష్యా ప్రకటనపై భగ్గుమన్న నాటో దేశాలు కూడా అణ్వస్త్రాలతో అలర్ట్ అవుతున్నాయి. దేనికైనా సై అని పశ్చిమ దేశాలు పేర్కొంటున్నాయి. తాజాగా ఉద్రిక్తలతో చరిత్రలో కనివిని ఎరుగని సాగసాకి, హిరోషిమా విషాదాలు మరొకసారి కళ్ల ముందు కదలాడాయి. ఉక్రెయిన్ పై యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
ఓవైపు రెండు దేశాలు చర్చలకు అంగీకరించి ప్రక్రియ మొదలైన అణ్వాయుధ బలగాలను హై అలెర్ట్‌లో ఉంచాలని ఆర్మీ చీఫ్ లను ఆదేశించారు పుతిన్. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో బయటి నుండి జోక్యం చేసుకోవాలని ఎవరైనా భావిస్తే.. చరిత్ర రిపీట్ అవుతుందని, పర్యవసానాలు సీరియస్‌గా ఉంటాయని నాటో దేశాలకు ముందే వార్నింగ్ ఇచ్చారు పుతిన్.
లేటెస్ట్‌గా నాటో దళాలు రష్యాకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నాయని అనుమానించిన పుతిన్.. అణ్వాయుధ బలగాలను అప్రమత్తంగా ఉంచాలని ఆర్మీ అధికారులను ఆదేశించారు. ఏది ఏమైనా శాంతి చర్చల వేళ పుతిన్ అణుబాంబుల ప్రకటన పశ్చిమ దేశాలకు హెచ్చరిక లాంటిదేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1945 తరువాత ఏ దేశం అణ్వాయుధాలు ఉపయోగించలేదు. తాజాగా పుతిన్ మాటలు అణుయుద్ధం హెచ్చరిక మాదిరిగానే కనిపిస్తున్నాయి.
Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశి వారు అనుకున్నది సాధిస్తారు