Home » పెళ్లి పీటలెక్కనున్న ప్రభాస్ హీరోయిన్ ?

పెళ్లి పీటలెక్కనున్న ప్రభాస్ హీరోయిన్ ?

by Bunty
Ad

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ గురించి తెలియని వారు ఉండరు. బాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది శ్రద్ధా కపూర్. 2010 సంవత్సరం లో తీన్ పత్తి సినిమాలో ఓ చిన్న పాత్ర తో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి… లవ్ కా ది ఎండ్ ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆషీకీ 2 సినిమాతో శ్రద్ధా కపూర్ రేంజ్ ఓ లెవెల్ లో కి పెరిగింది.

Advertisement

ఇటు టాలీవుడ్ లో సాహో సినిమా తో ఎంట్రీ ఇచ్చింది ఈ బాలీవుడ్ అందగత్తె. ఇది ఇలా ఉండగా శ్రద్ధ కపూర్… గత కొంత కాలంగా రోషం శ్రేష్ట అనే ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. పలు ఈవెంట్లు మరియు కార్యక్రమాల్లో జంటగా హాజరవడం ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చాయి. కాగా శ్రద్ధా కపూర్ వివాహంపై అలనాటి నటి.. ఆమె మేనత్త పద్మిని కొల్హాపురి తాజాగా ఓ హింట్ ఇచ్చింది.

Advertisement

దీంతో కత్రినా లాగే త్వరలోనే పెద్ద పెళ్లి కూడా జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతకీ విషయం ఏమిటంటే పద్మిని గతంలో తను పాడిన పాటను మళ్ళీ రీ క్రియేట్ చేసింది. శ్రద్ధ ఈ పాటను ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులతో షేర్ చేసింది. దీనికి స్పందించిన పద్మిని.. ” నీ పెళ్లి లో కూడా ఈ పాటను పాడతాను” అని రిప్లై ఇచ్చింది. దీంతో ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అని.. వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Visitors Are Also Reading