Home » “ఆదిపురుష్” సినిమా చూడాలంటే ఈ నియమాలు పాటించాలట.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో?

“ఆదిపురుష్” సినిమా చూడాలంటే ఈ నియమాలు పాటించాలట.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో?

by Srilakshmi Bharathi
Ad

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా ఆదిపురుష్. ఇప్పుడు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ చాలా గ్రాండ్ గా తీసారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఆదిపురుష్ సినిమాలో… సీతమ్మ పాత్రలో కృతి సనన్ నటించగా రామయ్య పాత్రలో ప్రభాస్ అలరించనున్న సంగతి తెలిసిందే.

Advertisement

 

ఈ సినిమాకు సంబంధించి రోజు రోజుకూ ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో ఓ సీటు హనుమంతుడి కోసం కేటాయిస్తున్నామని చిత్ర బృందం ప్రకటించిన సంగతి విదితమే. తాజాగా.. ఈ సినిమా చూడాలంటే కొన్ని నియమాలు పాటించాలంటూ వాట్సాప్ లో ఓ నియమావళి మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ఈ పోస్ట్ చూస్తే మరీ ఇలాంటివి అవసరమా? అని అనిపించక మానదు. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో అనిపిస్తుంది.

aadipurush movie rules

ఇంతకీ ఆ నియమాలు ఏంటో ఓ సారి చూద్దాం.

Advertisement

  • మద్యం తాగి సినిమాకు వెళ్ళకూడదు.
  • మాంసాహారం సేవించాక సినిమాకి వెళ్ళవద్దు.
  • సినిమా చూడడానికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకండి.
  • సినిమా చూసేటప్పుడు, థియేటర్ వద్ద జై శ్రీ రామ్ అని తప్ప నటుల పేర్లు ఉచ్చరించవద్దు.
  • టి షర్ట్స్, పాంట్స్ లాంటివి కాకుండా పంచె కట్టుకుని పైన కాషాయపు కండువా కట్టుకుని సినిమా చూడడానికి వెళ్ళాలి.
  • కుదిరితే సినిమా చూపే స్క్రీన్ కింద ఇబ్బంది లేకుండా కొబ్బరికాయని కొట్టండి.
  • జై శ్రీ రామ్ అన్న నామస్మరణని ఎట్టి పరిస్థితిలోనూ ఆపకండి.

నవ్వు ఆపుకుంటున్నారు కదా. ఈ మెసేజ్ వాట్సాప్ లో తెగ వైరల్ అయిపోతోంది. అసలు ఈ మెసేజ్ ని ఎవరు పంపడం స్టార్ట్ చేసారో కానీ, వారికి దణ్ణం పెట్టొచ్చు అని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేసుకుంటున్నారు.

మరిన్ని ముఖ్య వార్తలు:

మెగాస్టార్ అలా చేయడం వల్లే ఆ పవన్ కళ్యాణ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందా? అసలు విషయం ఏంటంటే?

Adhipurush : హనుమంతుడి సీటు పక్కన ఉన్న సీటు ధర ఎంతో తెలుసా?

50 ఏళ్ల వయసులో మరో బిడ్డకు తండ్రయిన ప్రభుదేవా

Visitors Are Also Reading