Home » లీకైన‌ ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్‌.. సోష‌ల్ మీడియా వైర‌ల్‌

లీకైన‌ ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్‌.. సోష‌ల్ మీడియా వైర‌ల్‌

by Bunty
Ad

ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రూ ఎదురు చూస్తున్న మూవీ ఆర్ ఆర్ ఆర్‌. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా తెర‌కెక్కుతున్న మల్టీ స్టార‌ర్ సినిమా ఆర్ ఆర్ ఆర్‌. ఈ సినిమా ను ద‌ర్శ క ధీరుడు రాజమౌళి తెర‌కెక్కిస్తున్నారు. సినిమా లో రామ్ చ‌ర‌ణ్ కు జోడిగా అలియా భ‌ట్‌… ఎన్టీఆర్ కు జోడిగా ఒలివియా మెరిస్ లు న‌టించారు. అంతేకాకుండా… ఈ సినిమాలో బాలివుడ్ న‌టుడు అజ‌య్ దేవ్ గ‌న్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తుండగా.. రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర లో న‌టిస్తున్నారు.

Advertisement

Advertisement

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన పోస్ట‌ర్లు… పాట‌లు, టీజ‌ర్లు సినిమా పై అంచ‌నాల‌ను భారీగా పెంచ‌గా.. ఇవాళ ట్రైల‌ర్ విడుద‌ల కానుంది. ఇలాంటి నేప‌థ్యంలో.. ఆర్ ఆర్ ఆర్ సినిమా ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. వాస్త‌వానికి ఉద‌యం 11 గంట‌ల‌కు ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కావాల్సింది.

కానీ.. ముందే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అయితే.. లీకైన ఈ ట్రైల‌ర్ లో.. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ విజువ‌ల్స్ అదిరిపోయాయి. వాళ్లి ద్ద‌రి యాక్టింగ్ తో సినిమా పై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. కాగా.. ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు ఈ సినిమా ట్రైల‌ర్ యూట్యూబ్ లో విడుద‌ల కానుంది.

https://www.facebook.com/watch/?v=7090480430969567

Visitors Are Also Reading