Home » RRR, పుష్ప మూవీస్ పై సంచలన కామెంట్స్ చేసిన నటుడు.. నెటిజన్స్ ఏమంటున్నారంటే..?

RRR, పుష్ప మూవీస్ పై సంచలన కామెంట్స్ చేసిన నటుడు.. నెటిజన్స్ ఏమంటున్నారంటే..?

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమాలు భారీ విజయాలను అందుకున్న విషయం మనందరకిీ తెలిసిందే. అంతేకాదు.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబడ్డాయి. ఈ రెండు సినిమాలు మంచి బిజినెస్ కూడా చేశాయి. ఆర్ఆర్ఆర్ సినిమా వేయికోట్ల రూపాయల క్లబ్ లో చేరగా, పుష్ప చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. పాన్ ఇండియా సినిమాలైనా ఈ రెండు సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాయి. అలాగే విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ దక్కింది. అయితే కొంతమంది సినిమా పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. విడుదలకు ముందు విడుదల తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ సినిమాపై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు.

Advertisement

Advertisement

అయితే బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా కూడా ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలపై సంచలన కామెంట్స్ చేశాడు. సినిమాలపై ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. గతంలోనూ చాలా సూపర్ హిట్ సినిమాలపై కొందరి నెగిటివ్ కామెంట్స్ చేశారు. మన దగ్గర అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాపై కూడా విమర్శలు చేశారు. ఇప్పుడొస్తున్న సినిమాల్లో హీరోయిజం తప్ప ఏమీ ఉండటం లేదు అని అన్నారు. హాలీవుడ్ లో అలాంటి సూపర్ హీరోల సినిమాలు వస్తుంటాయి. మన దగ్గర కూడా ఇప్పుడు అలాంటి సినిమాలే వస్తున్నాయి అన్నారు.

తాజాగా నసీరుద్దీన్ షా మాట్లాడుతూ.. కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. యంగ్ హీరోలపై నాకు చాలా నమ్మకం ఉంది. వారు మనకంటే ఎక్కువ అభివృద్ధి చెందారు. వాళ్లు చాలా తెలివైన వారు కూడా ఉన్నారు. కానీ కొన్ని సినిమాలు చూస్తే థ్రిల్ తప్ప మరేమీ రాదు. ఆర్ఆర్ఆర్ చూడాలని ప్రయత్నించాను. కానీ చూడలేకపోయాను. పుష్ప సినిమా కథ కూడా అదే. మణిరత్నం సినిమాలన్నీ చూస్తాను. ఎందుకంటే వారు చాలా మంచి సినిమాలు చేస్తారు. ఆయన సినిమాల్లో ఎజెండా ఉండదు అని అన్నారు. అయితే నసీరుద్దీన్ షాపై నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు. దేశం గర్వించదగ్గ సినిమాలపై ఆయన కామెంట్స్ చేయడం పై నేటిజన్స్ సీరియస్ అవుతున్నారు. సినిమాలు చూడకుండానే ఎలా తప్పుబడతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Visitors Are Also Reading