Home » “ఆర్ఆర్ఆర్” సాంగ్ తో అమెరికాలో రచ్చ… వీడియో వైరల్

“ఆర్ఆర్ఆర్” సాంగ్ తో అమెరికాలో రచ్చ… వీడియో వైరల్

by Bunty
Ad

“ఆర్ఆర్ఆర్” చిత్రం నుండి రెండవ సింగిల్ ‘నాటు నాటు’అంటూ విడుదలైన ఊర మాస్ సాంగ్ ఇంకా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ప్రధాన తారాగణం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంఎం కీరవాణి మాస్ బీట్‌లకు వేసిన స్టెప్పులు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ ఇండియాలోని 5 భాషల్లో ఒకేసారి విడుదలైంది. ఈ ఒక్క సాంగ్ సినిమాపై అంచనాలను వేరే రేంజ్ లో పెంచేసింది. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి పాడిన ఈ మాస్ సాంగ్ కు గీత రచయిత చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఇప్పటికే యూట్యూబ్ లో భారీ వ్యూస్ కొల్లగొట్టిన ఈ సాంగ్ విదేశాల్లో ఉన్న భారతీయులను సైతం ఊపేస్తోంది. తాజాగా అమెరికాలో “నాటు నాటు” సాంగ్ కు కొందరు స్టెప్పులేస్తూ కన్పించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. డల్లాస్ లోని ఓ పబ్ లో “నాటు నాటు” సాంగ్ హిందీ వెర్షన్ ను ప్లే చేయగా, జనాలు చిందులు వేస్తూ కన్పించారు.

Advertisement

Advertisement

“ఆర్ఆర్ఆర్” క్రేజ్ ను తెలుపుతూ ఈ వీడియోను ఓ నెటిజన్ షేర్ చేయగా, “ఆర్ఆర్ఆర్” మూవీ టీమ్ దృష్టికి వచ్చింది. వారు కూడా ఈ వీడియోను తన అధికారిక సోషల్ మీడియాలో అకౌంట్ లో షేర్ చేశారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాగ్నమ్ ఓపస్ మూవీని డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎపిక్ పీరియాడిక్ ఫిల్మ్ “ఆర్ఆర్ఆర్” 2022 జనవరి 7న బహుళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://twitter.com/RRRMovie/status/1467401974245040128

Visitors Are Also Reading