తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టర్లలో రాజమౌళి టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే టాప్ 5 దర్శకుల్లో ఈయన కూడా ఒకరని చెప్పవచ్చు. అలాంటి రాజమౌళి బాహుబలి సినిమా ద్వారా తన టాలెంట్ ఏంటో పాన్ ఇండియా లెవెల్ లో చూపించారు.
Advertisement
ఆయన ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో చేసిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదంటే ఆయన దర్శకత్వం ఏవిధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి రాజమౌళి సినిమా అంటే ఏ హీరో హీరోయిన్ల కైనా ఎంతో ఇష్టముంటుంది.
also read:ఘట్టమనేని ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడా…?
Advertisement
ఆయన సినిమాలో ఒక్క ఛాన్స్ కు కావాలని ఎంతోమంది వెయిట్ చేస్తారు. అంతటి దర్శక ధీరుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ మూవీని తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ఘన విజయన్ని అందుకుని కలెక్షన్ల పరంగా దూసుకుపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాని రాజమౌళి 2010లోనే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో తీయాలనుకున్నారట. కానీ ఇద్దరు స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం కష్టమవుతుందని, ముఖ్యంగా ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు వస్తాయని చేయలేదట.
also read:జై చిరంజీవ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!
కానీ రాజమౌళి బాహుబలి సినిమా విజయం తర్వాత ఆయన నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూశారో మనందరికీ తెలుసు. వారి వారి అంచనాలకు తగ్గట్టుగా సినిమా చేయాలంటే ఇద్దరు మల్టీస్టార్లను తీసుకుంటేనే బాగుంటుందని ఆర్ఆర్ఆర్ కాన్సెప్ట్ తో ఎన్టీఆర్ మరియు రాంచరణ్ హీరోలుగా ఇట్టి చిత్రాన్ని తీశారు.. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డు కూడా అందుకుని రికార్డు క్రియేట్ చేసింది.
also read:ఆయన వల్లే ఇల్లు కొనుక్కున్న అంటున్న రచ్చ రవి..!!