రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు కలెక్షన్ ల వర్షం కురిసింది. బాహుబలి తరవాత అంతటి కలెక్షన్ లను రాబట్టిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ సినిమాలో చాలా హైలెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ల నటన అద్భుతం అని చెప్పాలి.
అంతే కాకుండా ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. సినిమాలో హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్ ను వాడారు. అంతే కాకుండా ఎక్కడా కూడా గ్రాఫిక్ వర్క్ అనిపించకపోవడం విశేషం. ఇక సినిమాలో అన్నింటికంటే క్లైమాక్స్ ఫైట్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.సినిమా మొత్తం లో రామ్ చరణ్, ఎన్టీఆర్ సపరేట్ గా పోరాడతారు.
కానీ క్లైమాక్స్ ఫైట్ లో మాత్రం ఇద్దరూ కలిసి విలన్ పై ఫైట్ చేస్తారు. దాంతో ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేయడం అభిమానులకు తెగనచ్చేసింది. ఈ ఫైట్ కు థియేటర్ లో విజిల్స్ మరియు క్లాప్స్ పడ్డాయి. అయితే ఈ క్లైమాక్స్ ఫైట్ లో జక్కన్న చిన్న మిస్టేక్ కూడా చేశాడు. అయితే కావాలని చేసి ఉండకపోవచ్చు కానీ సరిగ్గా చూసుకుని ఉండకపోవడం వల్ల జరిగినట్టు ఉంది.
క్లైమాక్స్ ఫైట్ లో రామ్ చరణ్ రామరాజు లుక్ లు విల్లు పట్టుకుని కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైట్ లో రామరాజు భుజానికి ఓ సీన్ బాణాలు కనిపిస్తే మరో సీన్ లో మాత్రం బాణాలు కనిపించలేదు. ఈ సినిమాలో ఓటిటిలో విడుదలైన తరవాత ప్రేక్షకులు గుర్తించారు. జక్కన్న ఎలా మిస్ అయ్యాడబ్బా అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ALSO READ :భోళాశంకర్ సినిమా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ఇవే..!