Home » ఆర్ఆర్ఆర్ విడుద‌ల‌పై ఆర్జీవీ ఏమ‌న్నారంటే..?

ఆర్ఆర్ఆర్ విడుద‌ల‌పై ఆర్జీవీ ఏమ‌న్నారంటే..?

by Bunty
Ad

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లు క‌లిసి దిగ్గ‌ర డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ భాష‌ల నుంచి కూడా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 07న పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌లవుతుంద‌ని ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ దేశ‌వ్యాప్తంగా క‌రోనా, ఒమిక్రాన్ కేసులు పెర‌గ‌డంతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా విస్త‌రించ‌డంతో పెద్ద పెద్ద సినిమాలు విడుద‌ల‌వ్వ‌డం ఆయా ప్ర‌భుత్వాలు ఆందోళ‌న చెందుతున్నాయి.

 

Advertisement

తాజాగా దీనిపై వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప్ర‌భుత్వాల‌కు ఒక అద్భుత‌మైన ఐడియాను ఇచ్చాడు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఒమిక్రాన్ గురించి కావాల్సిన గొప్ప ఐడియా ఒక‌టి త‌న వ‌ద్ద ఉన్న‌ద‌ని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌లైన‌ప్పుడు డ‌బుల్ డోస్ తీసుకున్న వారిని మాత్ర‌మే థియేట‌ర్‌ల‌లోకి అనుమ‌తి ఇవ్వాలి అని సూచించారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూడాల‌నే ఉద్ధేశంతో అయినా.. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుంటారు అని చెప్పుకొచ్చారు వ‌ర్మ‌.

Advertisement

అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉన్న క్రేజ్ తో అభిమానులు నిజంగానే రెండు డోసులు వేసుకుంటార‌ని ప‌లువురు కామెంట్ కూడా చేస్తున్నారు. ప్ర‌భుత్వానికి రామ్ గోపాల్ వ‌ర్మ అద్బుత‌మైన ఐడియా ఇచ్చార‌ని కామెంట్ చేస్తున్నారు. అయితే మ‌రి కొంద‌రు మాత్ర‌మే ఈ సినిమా కోసం ఇప్ప‌టి కే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నమ‌ని మళ్లీ ఇప్పుడు ఆంక్ష‌లు పెట్ట‌కండి అంటూ కామెంట్ చేస్తున్నారు. మ‌రోవైపు మ‌హారాష్ట్ర, ఢిల్లీ, క‌ర్నాట‌క‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా వంటి రాష్ట్రాల‌లో రాత్రి స‌మ‌యంలో క‌ర్ప్యూ విధించ‌డంతో ఆర్ఆర్ఆర్ విడుద‌ల వాయిదా ప‌డుతుంద‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మ‌రీ ఆర్ఆర్ఆర్ విడుద‌ల అవుతుందో.. లేక వాయిదా ప‌డుతుందో అనేది.

Visitors Are Also Reading