Home » హైప‌ర్ ఆదిపై మండిప‌డుతున్న ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్.. ఎందుకంటే..?

హైప‌ర్ ఆదిపై మండిప‌డుతున్న ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్.. ఎందుకంటే..?

by Anji
Ad

జ‌బ‌ర్ద‌స్త్ షో వ‌ల్ల చాలా మంది పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. అలా క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో హైప‌ర్ ఆది ఒక‌రు. కామెడీ షోతో పాటు ప‌లు సినిమాల్లో కూడా న‌టించాడు ఆది. త‌న‌దైన కామెడీతో పంచులు వేస్తూ ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తున్నాడు. ఇటీవ‌లే జ‌బ‌ర్ద‌స్త్ షోకి దూరంగా ఉన్న ఆది ఇటీవ‌లే తిరిగి షోకు హాజ‌రు అయ్యాడు. కామెడీ టైమింగ్‌తో త‌న పంచ్‌ల‌తో న‌వ్వించే ఆది పై ఇప్పుడు నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.


స్కిట్‌లో భాగంగా ఆది వేసిన సెటైర్లు ఇప్పుడు వివాద‌స్ప‌దంగా మారాయి. పాన్ ఇండియా హిట్‌గా నిలిచిన సినిమా పై ఆది చేసిన కామెంట్స్ పై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. స్కిట్‌లో భాగంగా ఆది ఆర్ఆర్ఆర్ సినిమాపై సెటైర్లు వేశాడు. ఆర్ఆర్ఆర్ పై సెటైర్లు వేయ‌డంతో తార‌క్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ తో పాటు జ‌క్క‌న్న‌ఫ్యాన్స్ కూడా మండిప‌డుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జ‌క్క‌న్న‌, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఈ సినిమా కూడా ఆ రేంజ్‌లోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఆస్కార్ అవార్డులు కూడా వ‌స్తాయ‌ని హాలీవుడ్ మీడియానే చెప్ప‌డం విశేషం.

Advertisement

Advertisement

Also Read :  ఆ సూప‌ర్ హిట్ పాట‌ను ఎక్క‌డా పాడ‌న‌ని ఎన్టీఆర్ కు కీర‌వాణి ఎందుకు మాటిచ్చారు…? ఆ పాట ఏంటంటే..?

RRR

ఈ సినిమా పై ఆది సెటైర్లు వేయ‌డంతో అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో మ‌ల్లి అనే చిన్న పాప కొమ్మ ఉయ్యాల అంటూ పాడే పాట‌తో సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. ఆ పాప పాట పాడ‌కుండా ఉంటే ఇంత జ‌రిగేది కాదు క‌దా అని సెటైర్లు వేశాడు ఆది. దీంతో ఆర్ఆర్ఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అగ్ర‌ద‌ర్శ‌కుడు అయిన‌టువ‌టి రాజ‌మౌళిపై సెటైర్లు వేస్తావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక చ‌ర‌ణ్‌, తార‌క్ అభిమానులు హ‌ద్దులు దాట‌వ‌ద్దు అంటూ ఆదిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read :  ఎన్టీఆర్ ‘కొమురం భీముడో’ సాంగ్‌ని ఇలా మార్చారేంట్రా బాబు..!

 

Visitors Are Also Reading