దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఎక్కడ చూసినా RRR పాటలు, డైలాగులు, సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. సోషల్ మీడియాలో RRR సినిమాకు సంబంధించిన వీడియోలు, హీరోలు, డైరెక్టర్ కు సంబంధించిన పలు ఆసక్తికర వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Advertisement
ముఖ్యంగా డైరెక్టర్ రాజమౌళి గురించి అలవాట్లు, ఇతర విషయాల గురించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి సతీమణి రమను గతంలో ఓ ఛానల్ వాళ్లు ఇంటర్వ్యూ చేశారు. అయితే, ఆ సమయంలో రాజమౌళి ఇంట్లో ఎలా ఉంటారు..? సినిమా ప్రపంచంలోకి వెళితే ఎలా ఉంటారు..? అనే విషయం యాంకర్ అడుగగా ఆమె ఇలా సమాధానం ఇచ్చింది.
Advertisement
ఇంట్లో పిల్లలతో హ్యాపీగా ఉంటాడు.. వారు చెప్పేది శ్రద్ధగా గ్రహిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది. అతను చాలా టాలెంట్ అంటూ చెప్పుకొచ్చింది. అదే విధంగా డబ్బు విషయంలో అస్సలు పట్టించుకోడు.. డబ్బు పైన ఆయనకు అంతగా ఆసక్తి ఉండదు. ఆయన దగ్గర డబ్బు ఉండవచ్చు అన్న ఆలోచనతో ఒక్కసారి అతనితో బయటకు వెళ్తే కష్టమే.. ఎందుకంటే అతని జేబులో ఒక్క రూపాయి కూడా ఉంచుకోడు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు.. సడెన్ గా డబ్బు అవసరం ఉంటే కష్టం కదా.. అందుకే రాజమౌళి డ్రైవర్ దగ్గర కొంత డబ్బు ఉంచుతానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. రాజమౌళికి సంబంధించిన ఎలాంటి విషయాన్ని అయినా తెలుసుకునేందుకు ఆసక్తిగా ఆ వీడియోలను చూస్తున్నారు.
Also Read : ఐపీఎల్ ఆరంగేట్రం బ్యాటర్ ‘టాయిలెట్ బ్రేక్’.. అతని కోసం ఆటగాళ్లందరూ ఎదురు చూపు..!