Home » బిగ్ బాస్ విన్నర్ సన్నీపై షూటింగ్ లో దాడి…!

బిగ్ బాస్ విన్నర్ సన్నీపై షూటింగ్ లో దాడి…!

by Azhar
Ad
బిగ్ బాస్ అనే ప్లాట్ ఫామ్ ఎంతో మందికి ఎన్నో అవకాశాలు వచ్చింది. ఇందులో రాకముందు అసలు ఎవరో తెలియని.. సరైన గుర్తిపు లేని వారు ఇందులోకి వచ్చిన తర్వాత హీరోలుగా మరీనా వారు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లలో ఒక్కడు సన్నీ. ఓ మాములు వీజే అయిన బిగ్ బాస్ 5 సీజన్ లోకి వచ్చిన తనదైన ప్రవర్తనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఏం అనిపిస్తే అది చెబుతూ బిందాస్ గ అతను ఉన్న తీరు అభిమానులను కట్టిపడేసింది. అదే అతనికి టైటిల్ కూడా తెచ్చిపెట్టింది.
ఇక టైటిల్ అందుకున్న తర్వాత సన్నీకి హీరోగా చాల అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమాల్లోనే సన్నీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సన్నీ హీరోగా వస్తున్న ఏటీఎం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక తాజాగా ఏ షూటింగ్ లోనే సన్నీ పై దాడి జరిగింది. హైదరాబాద్ లోనే హస్తినాపురం దగ్గర ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఉన్నట్టుండి ఓ రౌడీ అక్కడికి వచ్చి.. సన్నీతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత దాడికి కూడా ప్రయత్నించాడు. కానీ అక్కడ ఉన్న వారు ఆ వ్యక్తిని అడ్డుకొని సన్నీని అక్కడి నుండి పంపించేశారు.
అయితే అక్కడి నుండి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సన్నీ ఆ సదరు వ్యక్తి పై ఫిర్యాదు నమోదు చేయగా.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తనకు తెలియకుండా అక్కడ షూటింగ్ చేస్తునందుకే ఆ వ్యక్తి సన్నీ పైన దాడి చేసినట్లు తెలుస్తుంది. కానీ ఇదంతా కేవలం ఓ పబ్లిసిటీ స్టంట్ అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం పోలీసులు ఆ వ్యతి వివరాలు.. అతడిని ఎవరు పంపించారు అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నాలలో ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading