Home » రోషన్ వెంటపడుతున్న బడా బ్యానర్లు…!

రోషన్ వెంటపడుతున్న బడా బ్యానర్లు…!

by AJAY
Ad

శ్రీకాంత్ నట వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో రోషన్. నిర్మల కాన్వెంట్ సినిమా తో రోషన్ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేకపోయింది. కానీ రోషన్ నటనకు డ్యాన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. మొదటి సినిమా తోనే రోషన్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

Advertisement

ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రోషన్ ఏకంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణ దర్శకత్వం లో పెళ్లి సందD అనే సినిమాలో నటించాడు. శ్రీకాంత్ పెళ్లి సందడి సినిమాలో నటించి మంచి హిట్ అందుకోగా రోషన్ కూడా అదే టైటిల్ తో వచ్చాడు. అయితే ఈ సినిమా కూడా అనుకున్నమేర విజయం సాధించలేకపోయింది.

Advertisement

కానీ ఈ సినిమా ద్వారా రోషన్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ కుర్ర హీరోను భారీ ఆఫర్ లు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే వైజయంతి మూవీస్ బ్యానర్ పై సినిమా చేసేందుకు రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ఓ కొత్త దర్శకుడు తెరకక్కించబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కూడా ఓ సినిమా కమిట్ అయినట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading