28 ఏళ్ల తర్వాత టీమిండియా ధోని నాయకత్వంలో 2011 ప్రపంచ కప్ గెలుచుకుంది. అప్పుడెప్పుడో కపిల్ దేవ్ కెప్టెన్సీలో 1983లో తొలిసారి భారత్ వన్డే వరల్డ్ కప్ ముద్దాడింది. ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా వరల్డ్ కప్ బరిలో దిగనుంది. గత వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించిన రోహిత్ ఈ ఏడాది తన సారధ్యంలో ఎలాగైనా కప్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఈ సమయంలో రోహిత్ తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని బాధను షేర్ చేసుకున్నాడు.
Advertisement
నిజానికి 2011 ప్రపంచ కప్ టీమ్ ఇండియా జట్టులో రోహిత్ శర్మ ఆడాల్సి ఉంది. అయితే అప్పటి పరిస్థితుల దృష్ట్యా మహేంద్రసింగ్ ధోని… రోహిత్ ను కాదని స్పిన్నర్ పీయూష్ చావ్లాకు ఛాన్స్ ఇచ్చారు. ఆ సమయంలో జట్టులో చోటు దక్కనందుకు రోహిత్ శర్మ చాలా బాధపడ్డాడు. ఒంటరిగా గదిలో కూర్చుని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని రోహిత్ గుర్తు చేసుకున్నాడు. 2011 వరల్డ్ కప్ టీమ్ ఇండియా జట్టుకు నేను సెలెక్ట్ కానందుకు జీవితమంతా కోల్పోయినట్టుగా అనిపించింది.
Advertisement
ఇంకా జీవితమే లేదనిపించింది. నేను ఎంతో కృంగిపోయాను. గదిలో కూర్చుని ఏడుస్తూ ఉన్నాను. ఆ పరిస్థితుల్లో యువరాజ్ సింగ్ నా దగ్గరకు వచ్చి ఈ విషయంలో నువ్వు బాధపడి ప్రయోజనం లేదు. నువ్వు కష్టపడి నువ్వు ఏమిటో నిరూపించుకుంటే ఎవ్వరు నిన్ను ఆపలేరు. నీకు ఇంకా క్రికెట్ కెరియర్ చాలా ఉంది అంటూ నన్ను ఓదార్చి నాలో ఆత్మస్థైర్యాన్ని నింపాడు అంటూ రోహిత్ ఎమోషనల్ అయ్యాడు. ఇదిలా ఉంటే…భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచ కప్ ఆరంభం కానుంది. మెగాటోర్నీ కోసం టీమిండియా జట్టును ఇంకా ప్రకటించలేదు. జట్టులో ఎవరెవరిని ఎంపిక చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి
Mannara Chopra : డైరెక్టర్ అత్యుత్సాహం..మీడియా ముందే హీరోయిన్‌కు ము***ద్దు
హైదరాబాద్ లో WWE ఈవెంట్… జాన్ సీనా, రోమన్ రింగ్స్ వస్తున్నారు !
Rajinikanth : ‘జైలర్’ పై పగ తీర్చుకున్న RCB !