Home » IND vs ENG 1st Test : ఆ ఇద్దరితోనే మాకు తలనొప్పి.. పక్కా వ్యూహంతో బరిలోకి..!

IND vs ENG 1st Test : ఆ ఇద్దరితోనే మాకు తలనొప్పి.. పక్కా వ్యూహంతో బరిలోకి..!

by Anji
Ad

ప్రపంచ క్రికెట్ లో దిగ్గజ టీమ్స్ భారత్‌-ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో జనవరి 25 నుంచి టెస్ట్ మ్యాచ్ ప్రారంభ కానుంది. మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్. రెండు రోజుల ముందే   హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు.. దిగిన వెంటనే ప్రాక్టీస్ షురూ చేసింది. ఈ క్రమంలో తాజాగా టీమీండియా సారథి రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.

Advertisement

ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో రాణిస్తామని, అద్భుతమైన ప్రదర్శనతో సిరీస్ కైవసం చేసుకుంటామని’ రోహిత్ శర్మ్ చెప్పుకొచ్చాడు. ‘రెండు మాసాలుగా మా ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టులో బలమైన ఆటగాళ్ళు ఉన్నారు. ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. పక్కా వ్యూహంతో ఉప్పల్ మైదానంలోకి దిగుతాం’ అంటూ భారత జట్టు ప్రణాళికలను రోహిత్ వెల్లడించాడు.

Advertisement

‘టెస్ట్ సిరీస్‌లో అనేక మార్పులు సంతరించుకున్నాయి. 20 ఏళ్ల టెస్ట్ మ్యాచ్‌కి.. ఇప్పుడు జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లకు చాలా వ్యత్యాసం ఉంది. విరాట్ దూరం అవ్వడం భారత జట్టుకు లోటే. అయితే, జట్టులో స్థానం కోసం యువ ఆటగాళ్లను పరిగణిస్తాం. సీనియర్లకు కూడా తలుపులు ముసుకుపోలేదు. మూడో స్పిన్నర్ గా అక్షర్, కుల్దీప్‌లలో ఎవరిని అదించాలన్నది తల నొప్పిగా మారింది. పరిస్థితులకు అనుగుణంగా ఎవ్వరినీ బరిలోకి దించాలో నిర్ణయిస్తాం. సిరాజ్ గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. మా జట్టులో ఆయన ఒక కీలక బౌలర్’ అంటూ రోహిత్ శర్మ  చెప్పుకొచ్చాడు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading