ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పెద్ద డిబేట్ లా మారింది. అయితే అప్పట్లో అతని బ్యాట్ నుండి వచ్చే సెంచరీల పైన చర్చ అనేది జరిగితే.. ఇప్పుడు అతని వైఫల్యాల పైన చర్చ జరుగుతుంది. ఇక టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఎక్కడికి వెళ్లిన కూడా దీనిపైనే ప్రశ్నలు అనేవి ఎదురవుతున్నాయి. ఈ మధ్యే ఇంగ్లాండ్ పైన టీ20 సిరీస్ గెలిచిన తర్వాత రోహిత్ మీడియా ముందుకు రాగ… కోహ్లీ ఫామ్ గురించే ప్రశ్నించారు. అప్పుడు మాజీ ఆటగాళ్ల కామెంట్స్ ను తోసిపుచ్చుతూ విరాట్ కు మద్దతుగా నిలిచాడు రోహిత్ శర్మ.
Advertisement
అయితే ఆ తర్వాత ప్రారంభమైన మొదటి వన్డేలో గాయం కారణంగా ఆడని విరాట్ కోహ్లీ… నిన్న జరిగినా రెండో వన్డేలో తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఛేజింగ్ లో కింగ్ గా పేరు తెచ్చుకున్నా విరాట్… నిన్న లక్ష్య ఛేదనలో 25 బంతుల్లో కేవలం 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దాంతో కోహ్లీపై మళ్ళీ యధావిధిగా విమర్శలు అనేవి ప్రారంభమయ్యాయి. ఇక నిన్నటి మ్యాచ్ లో భారత జట్టు ఓడిన తర్వాత మళ్ళీ మీడియా ముందుకు కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చాడు. అక్కడ కూడా జట్టు ఓటమి కంటే ముందే విరాట్ ఫెయిల్యూర్ గురించే ప్రశ్నించారు.
Advertisement
ఇక మీడియా ప్రశ్నలకు రోహిత్ సమాధానం ఇస్తూ.. కోహ్లీ ఫామ్ పై తనకు ఏ విధమైన ఆందోళన అనేది లేదు అని పేర్కొన్నాడు. అలాగే కోహ్లీ గతంలో ఎన్నో మ్యాచ్ లలో భారత జట్టుకు విజయాలను అందించాడని… అతను మళ్ళీ పరుగులు చేస్తాడు అనే నమ్మకం తమకు ఉంది అని పేర్కొన్నాడు. అయితే కోహ్లీ లాంటి ఆటగాళ్లు ఫామ్ లోకి రావడనికి ఒక్క ఇన్నింగ్స్ సరిపోతుంది.. అది త్వరలోనే మనం విరాట్ నుండి చూడవచ్చు అని రోహిత్ స్పష్టం చేసాడు. అయితే ఈ రెండు జట్ల మధ్య మళ్ళీ మూడో వన్డే అనేది ఈ నెల 17న జరగనుంది. మరి ఈ మ్యాచ్ లోనైనా విరాట్ తన స్థాయికి తగ్గిన ప్రదర్శన చేస్తాడా.. లేదా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి :