Home » Rohit Sharma : చిక్కుల్లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌..? బ్యాన్ వేసేందుకు సిద్ద‌మౌవుతున్న‌ ఐసీసీ..?

Rohit Sharma : చిక్కుల్లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌..? బ్యాన్ వేసేందుకు సిద్ద‌మౌవుతున్న‌ ఐసీసీ..?

by Bunty
Ad

 

రోహిత్ శర్మ ఇటీవల క్రికెట్ పిచ్ లపై బహిరంగంగా చేసిన వాక్యాలను ఐసీసీ తీవ్రంగా ఖండించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రోహిత్ పై ఐసీసీ తీవ్రంగా చర్యలు తీసుకొనున్నట్లు రిపోర్టులు, నివేదికలు చెబుతున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం విస్మయానికి గురిచేసింది. ఐదు సెషన్లలోనే మ్యాచ్ ఫలితం తేలిపోయినా న్యూజిలాండ్ పిచ్ పై దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ సహా పలువురు క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ మ్యాచ్ రిఫరీలపై ఘాటు వాక్యాలు చేశారు. ఐసీసీ మరియు మ్యాచ్ రిఫరీలు తటస్థంగా ఉండాలన్నారు. పిచ్ లపై రేటింగ్ ఇచ్చే విషయంలో ఐసీసీ ద్వంద వైఖరిని తప్పుపట్టారు.

Advertisement

ఆతిధ్య దేశానికి కాకుండా పిచ్ పరిస్థితిని చూసి రేటింగ్ ఇవ్వాలని రోహిత్ అభిప్రాయపడ్డాడు. భారత్ లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ పిచ్ పై ఓ బ్యాటర్ సెంచరీ చేసినా ఐసీసీ దానికి యావరేజ్ రేటింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశాడు. భారత్ కు వచ్చి ఆడేటప్పుడు ఇతరులు నోరు మూసుకొని ఉన్నంతవరకు ఇలాంటి పిచ్ లపై ఆడేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు.

రోహిత్ చేసిన ఈ వాక్యాలు వైరల్ కావడంతో ఐసీసీ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు రోహిత్ పై చర్యలు తీసుకునేందుకు ఐసీసీ సిద్ధమవుతుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అదే జరిగితే రోహిత్ శర్మపై నిషేధం లేదా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్ త్వరగా ముగియడంతో వివాదం చెలరేగింది. రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సఫారీ జట్టు 55 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం రబాడ దాటికి భారత బ్యాటర్లు కూడా పెవీలియన్ కు క్యూ కట్టారు. తొలిరోజే ఈ పిచ్ పై ఏకంగా 23 వికెట్ల పడటం క్రికెట్ దిగ్గజాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading