ఈ ఏడాది ఐపీఎల్ అనేది ముగిసిన తర్వాత భారత జట్టులో చాలా మార్పులు అనేవి వచ్చాయి. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశాలు అనేవి ఇస్తూ.. సీనియర్ ప్లేయర్స్ కు రెస్ట్ అనేది ఇచ్చింది బీసీసీఐ. అది పర్లేదు కానీ.. సిరీస్ కో కెప్టెన్ అనే విధంగా ఒక్క ఈ ఏడాదిలోనే 8 మంది కెప్టెన్ లను మార్చింది బీసీసీఐ. దీనిపైన అభిమానుల నుండి గాని.. విశ్లేషకుల నుండి గాని చాలా విమర్శలు వచ్చాయి.
Advertisement
అయితే భారత జట్టు అసలు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ.. అందుబాటులో లేకపోవడం లేదా అతనికి రెస్ట్ ఇవ్వడం వల్ల బీసీసీఐ ఇలా కెప్టెన్లను మారుస్తూ వచ్చింది. ఇక దీనిపైన ఇన్ని విమర్శలు అనేవి వచ్చినా కూడా ఇది మంచిదే అని అంటున్నాడు రోహిత్ శర్మ. తాజాగా విండీస్ పర్యటన పూర్తయిన తర్వాత ఓ స్పోర్ట్స్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ రోహిత్ ఇలా అన్నాడు.
Advertisement
మేము ఈ ఆసియా కప్ తర్వాత ప్రపంచ కప్ వంటి మెగాటోర్నీలు ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ మెగా టోర్నీలో ఆటగాళ్లకు అందరికి ఒత్తిడిని అధిగమించడం… పరిస్థితులను అర్ధం చేసుకొని ముందుకు వెళ్లడం అనేది తెలియాలి. అయితే ఇవ్వని కెప్టెన్ గా చేస్తే తప్పకుండ వస్తాయి. కాబట్టి నాకు వారితో కలిసి ఆడే సమయంలో అది సహాయపడుతుంది. నాకు పని తేలిక అవుతుంది. కాబట్టి ఆ పద్ధతి మంచిదే అని రోహిత్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :