Home » పాకిస్థాన్ తో మ్యాచ్ అంటేనే ఒత్తిడి..!

పాకిస్థాన్ తో మ్యాచ్ అంటేనే ఒత్తిడి..!

by Azhar
Ad

ఇండియా, పాకిస్థాన్ జట్లు ద్వైపాక్షిక మ్యాచ్ లలో పాల్గొని దశాబ్దం దాటిపోయింది. చాలా ఏళ్ళ నుండి ఈ రెండు జట్లు ఐసీసీ టోర్నీలలోనే పోటీ పడుతున్నాయి. అయితే ఈ రెండు జట్లు పోటీ పడుతున్నాయి అంటే.. రెండు దేశాలలో ఉండే ప్రజలు ఎవరు విజయం సాధిస్తారు అని చాలా ఉత్కంఠంగా చూస్తారు. అందుకు కారణం రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు. ఈ మ్యాచ్ లో ఎన్నో భావోద్వేగాలు అనేవి ఉంటాయి.

Advertisement

ఇక ఇంతటి హై హోల్టేజ్ మ్యాచ్ లో ఆడే ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది అని టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తాజాగా రోహిత్ ఓ ఇంటర్వ్యూలో పాకిస్థాన్ తో మ్యాచ్ కోసం చేస్తున్న తయారీ గురించి వివరించాడు. మామూలుగానే పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే ఒత్తిడి అనేది ఉంటుంది అని రోహిత్ అన్నాడు. అలాగే ఆటగాళ్లు కూడా ఈ మ్యాచ్ లో భావోద్వేగాలకు లోనవుతారు అని చెప్పాడు.

Advertisement

కానీ మేము ఈ మ్యాచ్ ను కూడా ఓ మాములు మ్యాచ్ లాగా చూడాలని ఆటగాళ్లకు సూచిస్తాం అని రోహిత్ అన్నాడు. పాకిస్థాన్ జట్టును మరో మాములు జట్టులాగే చూడాలి. అలాగే ఈ మ్యాచ్ ను కూడా మామూలుగానే ఆడాలి అని నేను, కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్లేయర్స్ కు చెబుతాం. వారిని ఈ మ్యాచ్ కోసం మానసికంగా తాయారు చేస్తాం అని రోహిత్ అన్నాడు. అయితే ఈ నెల 28న ఈ రెండు జట్లు ఆసియా కప్ లో భాగంగా పోటీ పడనున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

1000 రోజులు పూర్తి చేసుకున్న విరాట్..!

భారత జట్టుకు దొరికిన లక్కీ ప్లేయర్‌.. ఉంటె విజయమే..!

Visitors Are Also Reading