Home » ఏ జట్టును ఎలా ఓడించాలో నాకు తెలుసు..!

ఏ జట్టును ఎలా ఓడించాలో నాకు తెలుసు..!

by Azhar
Ad

ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రపంచ కప్ లో భారత జట్టు ఈసారి రోహిత్ శర్మ సారథ్యంలో బరిలోకి దిగుతుంది. అయితే ఈసారి కెప్టెన్ గా రోహిత్ పై చాలా ఆశలు అనేవి ఉన్నాయి. కానీ ఈ టోర్నీ కంటే ముందు జరిగిన ఆసియా కప్ లో రోహిత్ కెప్టెన్సీ చూసి.. కొంత అనుమానం అయితే కలుగుతుంది. కానీ ఏ జట్టును ఎలా ఓడించాలో నాకు తెలుసు అని ఇప్పుడు రోహిత్ అంటున్నాడు.

Advertisement

అయితే ఈ టోర్నీలో భారత జట్టు ఈ నెల 23న మొదటి మ్యాచ్ అనేది పాకిస్థాన్ తో ఆడనుంది. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడుతూ.. ఐసీసీ టోర్నీలో భారత జట్టుకు కెప్టెన్సీ వహించడం నేను ఎప్పటికి మర్చిపోను. ఈ అనుభూతు నాకు మొదటిసారి కలుగుతుంది అని.. తన కెప్టెన్సీ గురించి రోహిత్ మాట్లాడాడు.

Advertisement

ఇక ఈ ప్రపంచ కప్ లో జరిగే ప్రతి మ్యాచ్ అలాగే ప్రతి జట్టుపై ఎలా విజయం సాధించాలి అనే ప్లాన్ ఓ కెప్టెన్ గా నానా వద్ద ఉంది. పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు నా వ్యూలను బయటపెడుతా అని రోహిత్ చెప్పాడు. కానీ ఆసియా కప్ లో రోహిత్ కెప్టెన్ గా చాలా అగ్రెసివ్ గా కనిపించాడు. ఈ క్రమంలో ఈ ప్రపంచ కప్ లో రోహిత్ ఏం చేస్తాడు.. ముఖ్యంగా పాక్ తో మ్యాచ్ లో ఇండియాను గెలిపిస్తాడా అనే అనుమానాలు ఫ్యాన్స్ కు ఎక్కువగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

పోయినసారి మ్యాచ్ తర్వాత.. ఇప్పుడు మ్యాచ్ కంటే ముందే..?

మ్యాచ్ ఆడాలని లేదు.. అయితేనే ఇలా కొట్టవా..?

Visitors Are Also Reading