Home » శ్రీలంక మ్యాచ్‌లో హైడ్రామా.. క్రీడా స్పూర్తిని చాటుకున్న రోహిత్ శర్మ

శ్రీలంక మ్యాచ్‌లో హైడ్రామా.. క్రీడా స్పూర్తిని చాటుకున్న రోహిత్ శర్మ

by Bunty
Ad

స్వదేశంలో శ్రీలంకతో ఇటీవలే టి20 సిరీస్ ను నెగ్గిన భారత జట్టు వన్డేలలో కూడా శుభారంభం చేసింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మంగళవారం గువాహతి (అసోం)లోని బర్సపర స్టేడియం వేదికగా ముగిసిన తొలి వన్డేలో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. తోలుత బ్యాటింగ్ లో రాణించి భారీ స్కోరు సాధించిన టీమిండియా, ఆ తర్వాత లంకను 50 ఓవర్లలో 8 వికెట్లు తీసి 38 పరుగులకే కట్టడి చేసింది. ఫలితంగా భారత్, 67 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో ‘మనకడింగ్ రనౌట్’ కు భారత పెసర్ మహమ్మద్ షమీ ప్రయత్నించగా, రోహిత్ శర్మ నిరాకరించాడు. షమీ చేత అప్పిల్ ను వెనక్కు తీసుకునేలా చేసి అందరి మనసులను గెలుచుకున్నాడు. ఆ సమయంలో శ్రీలంక కెప్టెన్ డసన్ శనక 98 పరుగులతో నాన్ స్ట్రైకర్ గా ఉండటంతో రోహిత్, మనకడింగ్ అవుట్ కు నిరాకరించాడు. శ్రీలంక ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో ఈ హైడ్రామా చోటు చేసుకోగా, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

శ్రీలంక ఇన్నింగ్స్ చివరి ఓవర్ ను మహమ్మద్ షమీ వేయగా, తొలి మూడు బంతులను ఆడిన శనక 2,0,1 తో మూడు పరుగులు చేశాడు. నాలుగో బంతికి టేయిలేండర్ కసూన్ రజిత స్ట్రైకింగ్ రాగా, 98 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్న శనక నాన్ స్ట్రైకర్ లో ఉన్నాడు. సెంచరీ చేసుకోవడంపై ఫోకస్ పెట్టిన శనక, సింగిల్ తీసి ఇవ్వాలని రజితకు సూచించారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ భారత ఫీడర్లను సర్కిల్ లోపల పెట్టగా, షమీ బంతి వేయకముందే షనక క్రిజు దాటాడు. ఇది గమనించిన షమీ, మనకడింగ్ పద్ధతిలో రన్ అవుట్ చేసి ఆప్పీల్ చేశాడు. దాంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. అంతలోనే కెప్టెన్ రోహిత్ శర్మ జోక్యం చేసుకొని షమీ చేత ఆపిల్ ను వెనక్కి తీసుకున్నాడు. దాంతో ఆట కొనసాగగా, స్ట్రైక్ లోకి వచ్చిన శనక బౌండరీ తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రోహిత్‌ దగ్గరకు వచ్చి..థ్యాంక్స్‌ చెప్పాడు శనక.

READ ALSO : Varasudu Review Telugu: “వారసుడు” రివ్యూ..విజయ్‌ కి షాక్‌ తప్పదా ?

 

Visitors Are Also Reading