Telugu News » Blog » Varasudu Review Telugu: “వారసుడు” రివ్యూ..విజయ్‌ కి షాక్‌ తప్పదా ?

Varasudu Review Telugu: “వారసుడు” రివ్యూ..విజయ్‌ కి షాక్‌ తప్పదా ?

by Bunty

Varisu Varasudu Review Telugu: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం వారసుడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రీకరించారు. అంతేకాకుండా ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఇక భారీ అంచనాల నడుమ ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. కొన్ని కారణాలవల్ల ఈ సినిమా ఇవాళ తెలుగులో రిలీజ్ కాలేదు. మిగతా భాషలో రిలీజ్ అయింది.

Advertisement

varisu-review

READ ALSO : కిరాక్ ఆర్పీ చేపల పులుసు కర్రీ పాయింట్ రీ ఓపెన్

Varisu Varasudu Review Telugu

Varisu Varasudu Review Telugu

Varasudu: Varisu Story: కథ మరియు వివరణ

ఈ  సినిమా వారసుడు ఎంపిక చుట్టూ తిరిగే కథ. రాజేంద్రన్ (శరత్ కుమార్) ఓ పెద్ద బిజినెస్ టైకాన్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన ముగ్గురు కొడుకులు జై (శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్) వీళ్ళలో ఎవరికి అప్ప చెప్పాలనే ఆలోచనలో ఉంటాడు. విజయ్ తన తండ్రి విధానాలు నచ్చక అభిప్రాయ భేదాలు వచ్చి, విబేధించి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. జై, అజయ్ ల కన్ను మాత్రం ఈ చైర్మన్ కుర్చీ పైనే ఉంటుంది. ఎలాగో వ్యాపార ప్రత్యర్ధులు జై ప్రకాష్ (ప్రకాష్ రాజ్) ఉండనే ఉన్నాడు. ఈ క్రమంలో రాజేంద్రన్ తన టైమ్ అయిపోయిందని గ్రహిస్తాడు. తన సామ్రాజ్యానికి అసలైన వారసుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు. ఏడేళ్లపాటు కుటుంబానికి దూరంగా ఉన్న విజయ్, తన మంచితనం, కుటుంబం పట్ల ప్రేమ, బిజినెస్ తెలివితో ఎలా తన వారసుడు అనిపించుకున్నాడు. తన అన్నలలో ఎలాంటి మార్పు తెచ్చాడు. ప్రత్యర్థిగా ఉండి కుట్ట చేస్తున్న జయప్రకాష్ కి ఎలా బుద్ధి చెప్పాడు. బీటలు తీసిన తన కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు. రష్మికతో తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు. వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

Varisu: Varasudu Review in Telugu

Varasudu Review Telugu

Varasudu Review Telugu

ఇది ఇలా ఉండగా, కెరీర్ ప్రారంభంలో విజయ్ చేసిన సినిమాల్లో హైలెట్స్ ఇక్కడ ప్లే అవుతుంటాయి. అవి కచ్చితంగా విజయ్ ఫ్యాన్స్ కు పండగ చేసేవే. అయితే విజయ్ సినిమాలు ఫాలో కాని వారు మాత్రం ఆ స్థాయిలో ఎంజాయ్ చేయలేరు. అయితే అది అంత ఫోర్స్ గా అనిపించవు. కథలో భాగంగా వచ్చేస్తాయి. సెకండ్ హాఫ్ లో కామెడీ, హీరోయిజంను మీటర్ ప్రకారం మ్యాటర్ లో కలిపి అందించిన కాక్ టెయిల్. మధ్య మధ్యలో సెంటిమెంట్ సీన్స్ నీ పేర్చారు. అదృష్టం ఏమిటంటే మరి మెలోడ్రామా వైపుకు తను చేయకపోవడం.

ప్లస్ పాయింట్స్:
విజయ్ యాక్టింగ్‌
కామెడీ వన్ లైనర్స్
యోగి బాబుతో వచ్చే సీన్స్

మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ
ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే
ఫ్యాన్స్ కు నచ్చే సీన్స్ కు ప్రయారిటీ ఇవ్వటం

రేటింగ్‌ : 2/5

READ ALSO : Samantha : అందం తగ్గిందని నెటిజన్‌ కామెంట్‌.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన సమంత