ఇండియా vs పాకిస్థాన్ ఏ మాటే అభిమానుల్లో ఓ కొత్త ఉత్తేజం నింపుతుంది. అయితే ఈ మ్యాచ్ అనేది క్రికెట్లోనే జరిగితే ఆ కిక్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఎందుకంటే రెండు దేశాలలో కూడా క్రికెట్ నే ప్రజలు ఎక్కువ ఇష్టపడుతారు. అయితే ఈ రెండు దేశాలు కేవలం ఐసీసీ, ఆసియా టోర్నీలలో మాత్రమే పోటీ పడుతుండటంతో అభిమానులకు ఈ మజా తక్కువ దొరుకుతుంది.
Advertisement
కానీ ఈ ఏడాది ఇప్పటికే ఆసియా కప్ లో భాగంగా రెండు సార్లు తలపడిన ఇండియా, పాక్ రేపు ప్రపంచ కప్ లో భాగంగా ఎదురుపడనున్నాయి. కానీ ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు అనేది ఉంది అని తెలుస్తుంది. ఇక ఈ పరిస్థితి పై స్పందిచిన బాబర్ ఆజాం.. వాతారణం అనేది మన చేతిలో లేదు. కానీ నేను కూడా పూర్తి మ్యాచ్ జరగాలి అనే అనుకుంటున్నాను. కానీ దేనికైనా సిద్ధంగా ఉన్నాము అని చెప్పాడు.
Advertisement
ఇక ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఇక్కడ సిడ్నీలో వాతావరణం అనేది తొందరగా మారిపోతుంది. అందువల్ల ఏం జరుగుతుందో తెలియదు. పాకిస్థాన్ లో 20 ఓవర్ల మ్యాచ్ జరగవచ్చు. లేదంటే.. 10, 5 ఓవర్ల మ్యాచ్ కూడా జరగవచ్చు. కానీ ఎన్ని ఓవర్ల మ్యాచ్ జరిగినా కూడా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పాడు. చూడాలి మరి రేపు వరుణుడు ఈ మ్యాచ్ కు హాజరు అవుతాడా లేదా అనేది.
ఇవి కూడా చదవండి :